హీరోయిన్స్ బేస్డ్ గా రామ్ కామ్ కథలు రాయాలే గాని చెలరేగిపోవడానికి నటీమణులు సిద్ధంగా ఉన్నారు. ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆహా ఓటీటీ రూపొందించిన ‘3 రోజెస్‘ ట్రైలర్ పిచ్చ వైరల్ అయ్యింది.
ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్ మరియు పూర్ణ అనే ముగ్గురు పెళ్లి కాని అమ్మాయిల కెరీర్ లైఫ్ రిలేట్ చేస్తూ వారి పెళ్లిని ప్రధాన కథాంశంగా తీసిన తెలుగు చిత్రం 3 రోజెస్.
ట్రైలర్‌ను చూసి ఆనందించండి.
పెళ్లి అనే కాన్సెప్ట్‌ను తలకిందులు చేసే ముగ్గురు యువతుల కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. చిన్న వయస్సులో పెళ్లి చేసుకోవాలనే సామాజిక ఒత్తిడి, అలాగే డేటింగ్, కుటుంబంలో పరిణామాలు కలగలపి తీశారు.
షాన్, ప్రిన్స్, వైవా హర్ష, సత్యం రాజేష్, సంగీత్ శోభన్, హేమ, గోపరాజు రమణ, సరయూ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది.
#VijayDeverakonda name sound in #3Roses trailer #liger pic.twitter.com/rBS19xuh6T
— Vijay Deverakonda (@VijayDe78593148) November 11, 2021