‘తానా’ 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మిక స్థాయిలో హామీలు ప్రకటించారు.
‘తానా’ 45 సంవత్సరాల చరిత్రలో సరికొత్త రికార్డు.
కోవిడ్ మహమ్మారి తీవ్రతతో 2021 లో నిర్వహించాల్సిన మహాసభలు వాయిదాపడి దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో 2023 జులై 7 నుండి 9 వరకు జరగబోతున్న ‘తానా’ మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నవంబర్ 5 నాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్ నగరంలోని ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది.
‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల హామీల విందులో ప్రవాసులు పాల్గొని, గతంలో జరిగిన అన్ని విరాళాల హామీలను మించిపోయేలా దాదాపు ఆరు మిలియన్ల డాలర్లు పైగా హామీలు ప్రకటించారు.
‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, EC, BOD మరియు ఫౌండేషన్ సభ్యులను, మాజీ అధ్యక్షులను, ఇతర కమిటీ సభ్యులను, వాలంటీర్లను పరిచయం చేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు.
విరాళాల హామీల కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్ధన్ బోబ్బా, జగదీశ్ యలమంచిలి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.