ఆమె వయసు కేవలం 26 ఏళ్లు. కానీ 22 మంది పిల్లలకు తల్లి అయింది. టర్కీకి చెందిన వ్యాపారవెత్త, మిలియనీర్ గాలిప్ సర్రోగేట్ భార్య క్రిస్టీనా ఓజ్ టుర్క్ ఇప్పటి వరకు అద్దె గర్బాల ద్వారా పిల్లలను కంటూ వస్తున్నది. మార్చి 2020 – జులై 2021 మధ్య ఈ పిల్లలను కంటూ ప్రపంచానికి పరిచయం చేసింది.
గతంలో ఉన్న భాగస్వామితో క్రిస్టీనాకు ఎనిమిదేళ్ల వయసున్న విక్టోరియా అనే కూతరు సహజంగా జన్మించింది. ఇక మిగిలిన వారు అందరూ చిన్న పిల్లలు కావడం గమనార్హం. పిల్లల సంఖ్య మూడంకెలకు చేరుకోవాలన్న అభిమతాన్ని ఆమె గతంలో వెల్లడించింది. ఇప్పటి వరకు సరోగసి కొరకు రూ.1.43 కోట్లు ఆమె వెచ్చించింది.
ఇక క్రిస్టినా బేబీస్ డైరీ అంటూ ఒక పుస్తకం రాయడం విశేషం. పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాలను అందులో పేర్కొనడం జరిగిందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన వాటిని అందించేందుకు దానిని ఫాలో అవుతున్నారని క్రిస్టీనా వెల్లడించింది.