గత రాత్రి బస చేసిన రాజువారి చింతల పాలెం గ్రామం నుండి ఉదయం 9 గంటలకు శాస్త్రోక్తంగా జరిగిన పూజల అనంతరం మహా పాదయాత్ర ప్రారంభమైంది.
గత కొన్ని రోజులుగా ఉన్న తుఫాన్ వాతావరణం తర్వాత… బహుశా మహాపాదయాత్ర లో తొలిసారిగా ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది.
ఈరోజు మహా పాదయాత్ర
రాజువారి చింతల పాలెం నుండి
కొత్తపల్లి,
చలం చర్ల అడ్డ రోడ్డు… మీదుగా
కావలి చేరింది.
సాధారణంగా పోలీసుల నియమం ప్రకారం సాయంత్రం 6 గంటలకు పాదయాత్ర ముగుస్తుంది. కానీ ఈరోజు కావలి పట్టణంలో వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో… పాదయాత్ర దాదాపు గంట ఆలస్యంగా ముగిసింది.
పాదయాత్ర పొడవునా… ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి పాదయాత్రను ఆదరిస్తున్నట్టే… ఈ రోజు కూడా కొత్తపల్లి అనే గ్రామంలో పోన గుంట్ల రవీంద్రనాథ్ గారి కుటుంబం, గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం ముందు, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని 116 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో జరిగిన పూజలో ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారితో కలిసి నేను కూడా పాల్గొనడం జరిగింది.
రవీంద్రనాథ్ గారి కుటుంబం పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు నూట యాభై చీరలు పెట్టి గౌరవించడం జరిగింది.
ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ఒక వైఎస్ఆర్ సీపీ యువజన నాయకుడు నాతో అరగంటపాటు నడిచి, సెల్ఫీ తీసుకోవటం… వైఎస్సార్సీపీ మద్దతుదారుల లో మారుతున్న ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది.
ఈరోజు మహా పాదయాత్ర లో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం… భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ చేయడం.
అమరావతి ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది అనేవారికి ఇది సరైన సమాధానం.
కావలి పట్టణంలో జనసేన నాయకులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.
కావలి పట్టణంలో పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ఎరుకల సంక్షేమ సంఘం సభ్యులు సంఘీభావాన్ని ప్రకటిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాత్రి బస చేసింది రాజువారి చింతల పాలెం లోనే బ్రహ్మంగారి మఠం లో….. ఈ రోజు రాత్రి బస కావలి లోని బాప్టిస్ట్ చర్చి లో…… బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.
జై అమరావతి
జై ఆంధ్ర ప్రదేశ్
🙏🙏🙏🙏🙏
కొలికపూడి శ్రీనివాస రావు