ఏమైనా జగన్ ధైర్యానికి మెచ్చుకోవచ్చు.
ఎవడికి నచ్చినా నచ్చకపోయినా తను అనుకున్నది చేస్తాడు.
రాష్ట్రంలో పవర్ ఉన్న పదవులన్నీ రెడ్లకు మాత్రమే ఇస్తాడు.
ఎవరూ అడగరు.
అడిగితే జగన్ పార్టీ నేతలు, అభిమానులు తిత్తి తీస్తారు
బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మరుసటి రోజే ఆత్మహత్యకు గురవుతారు. అందుకే కడుపులో ఎంత మంట ఉన్నా జగన్ అభిమానులకు భయపడి బలహీన వర్గాలతో పాటు, ఊ అంటే ఆ అంటే ముఖ్యమంత్రుల మీద విరుచుకుపడే ఉద్యోగులు మూసుకుని మూలన పనిచేసుకుంటున్నారు.
లేకపోతే వారు కూడా ఏపీలో మరో సుధాకర్ అవుతారు.
తాజాగా మరో ఇద్దరు రెడ్లకు జగన్ కిరీటం పెట్టారు.
AP రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ‘ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నా రెడ్డి’ గార్లు నియామకం.
ఇందులో ఈ హరిప్రసాద్ రెడ్డి జగన్ కోవర్టుగా అత్యధిక కాలం ఈనాడులో పనిచేశారు. జగన్ సీఎం అయ్యాక బయటపడ్డాడు.
ఏదేమైనా ఇరువురు రెడ్డి గార్లకూ ఇవే మా శుభాకాంక్షలు…💐
వడి వడిగా వెయ్యి కి చేరువలో పెద్ద పదవుల్లో రెడ్డి గార్ల నియామకాలు చేరుకుంటున్నాయి.
ప్రమాణ స్వీకారం రోజున
కులం చూడం
మతం చూడం
అని ప్రమాణ స్వీకారం చేశారు కదా అని జగన్ ని అడగొద్దు, జగన్ పరిపాలనను ఎంజాయ్ చేస్తూ ఉండాల్సిందే. అంతే మరి.
ఎందుకంటే ఆ ప్రమాణ స్వీకారం యొక్క తాత్పర్యం, మా కులం తప్ప మిగతా కులం చూడము అని.. !
నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక పదవుల నియామకాల్లో ముఖ్యమంత్రి వారి సామాజికవర్గానికి చెందిన వారికి ప్రాముఖ్యత ఇవ్వడం వంటి అంశాలపై ఈరోజు రాజధాని – రచ్చబండ.https://t.co/bwZ97FIZ8a#RRR #RaghuRamaKrishnamRaju #Rachabanda
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) May 5, 2021