భారతీయులకు బాటా కంపెనీ గురించి తెలిసినంతగా మరే ఇతర అంతర్జాతీయ కంపెనీ పేరు తెలియదేమో. తెలుగు వాళ్లు వేసే సెటైర్లలో హిందీ వాళ్ల కోపంలో, కన్నడిగుల సామెతలో ఇలా ఎక్కడైనా బాటా ఇమిడిపోయిందంటే… ఆ కంపెనీ అంతగా ఎదగడానికి ఎన్నో కారణాలు. అదొక బడ్జెట్ బ్రాండ్. క్వాలిటీ వ్యాపారానికి కూడా చిరునామా. చాలామంది ఆ కంపెనీ భారతీయ కంపెనీ అనుకుంటారు. కానీ అదొక విదేశీ కంపెనీ.
మనతో బంధాన్ని పెనవేసుకుపోయిన విదేశీ కంపెనీ బాటా. ఇపుడు ఈ చర్చ ఎందుకంటే బాటా కంపెనీకి తొలిసారిగా భారతీయుడు సీఈవో అయ్యారు.
అంతర్జాతీయ పాదరక్షల ప్రధాన బాటా షూ ఆర్గనైజేషన్ సోమవారం తన ఇండియా సీఈఓ సందీప్ కటారియాను గ్లోబల్ సీఈఓ గా ప్రమోట్ చేసింది. దీంతో బహుళ జాతి పాదరక్షల కంపెనీ తొలి భారతీయ సీఈవోగా సందీప్ నిలిచారు. ఈ మేరకు బాటా ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు ఐదేళ్ల తర్వాత పదవీవిరమణ చేస్తున్న అలెక్సిస్ నాసార్డ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
2017 లో బాటా ఇండియాలో సీఈఓగా చేరిన కటారియా ఇంతకుముందు భారతదేశం మరియు యూరప్‌లోని ప్రముఖ ప్రపంచ సంస్థలైన యునిలివర్, యమ్ బ్రాండ్స్ మరియు వోడాఫోన్లతో కలిసి పనిచేశారు.
కటారియా నాయకత్వంలో, బాటా ఇండియా తన లాభాలను రెట్టింపు అంకెల టాప్ లైన్ వృద్ధితో రెట్టింపు చేసిందట. ఆయన మార్కెటింగ్ ఐడియాస్ నెట్ వర్కింగ్ గొప్పగా బాటాను తీర్చిదిద్దింది. సందీప్ నేతృత్వంలో బాటా యువ వినియోగదారులకు దగ్గరయ్యింది.
కటారియా మాట్లాడుతూ, “భారతదేశంలో బాటా విజయవంతం కావడం నాకు ఎంతో ఆనందం ఉంది మరియు ప్రపంచానికి షూ మేకర్స్ గా మా గర్వించదగిన, 120 సంవత్సరాల చరిత్రను మరింతగా నిర్మించటానికి నేను ఎదురుచూస్తున్నాను” అన్నారు.
మన తెలుగు వారి ప్రతి మాటలో బాటా ఉంటుంది. మారుమూల పల్లెకు బాటా పదం తెలుసు. ఎవరైనా రూపాయిలు పైసల్లో రేటు చెబితే బాటా రేటు అంటుంటారు. ఎక్కువ కోపం ప్రదర్శించడానికి బాటా చెప్పుతో కొట్టాల్రా నిన్ను అంటుంటారు. చెప్పుతో కొడతానంటే మామూలు కోపం బాటాతో కొడతానంటే అంత త్వరగా తెగిపోతు కాబట్టి చాలాకోపం ఉన్నట్టన్నమాట.