ఏపీలో మంత్రులకు తాము మంత్రులమని, ఆ హోదాకు ఒక గౌరవం ఉంటుందని కూడా తెలిసినట్టు లేదు.
తమకు నచ్చకపోతే ఎవరిని అమర్యాదగా, అసభ్యంగా మాట్లాడి పై చేయి సాధించాలని అనుకుంటారు.
రాజ్యాంగం ప్రకారం ఎంత పెద్ద వాడు, ఎంత పెద్ద పదవిలో ఉన్న వాడు అయినా ఎవరినీ అవమానించే హక్కు లేదు.
రాజ్యాంగేతర నేర ప్రవృత్తితో ఏదైనా హాని చేస్తారేమో అని భయంతో ఎవరూ పెద్దవారిపై పోరాటాలకు దిగడం లేదు గాని… ఒక కూలీ కూడా తనకు ముఖ్యమంత్రి వల్ల అవమానం జరిగిందని నిరూపిస్తే ఆ కారణంతో ముఖ్యమంత్రి అయినా జైలుకు పోక తప్పదు. అది మన చట్టాలకు ఉన్న పవర్.
కనీసం రాజ్యాంగం అవగాహన లేని ఏపీ మంత్రులు కొందరు నోటికి వచ్చిన మాటలు మాట్లేడేసి తప్పును ఇతరుల మీద ప్రతిపక్షాల మీద తోసేసి బతికేద్దాం అనుకుంటారు. వైసీపీ సమర్థత ఏంటో ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది.
ఇక జగన్ ను ఆ ఓటర్ల నుంచి దేవుడు కూడా కాపాడలేని పరిస్థితి.
నిన్న అంటే డిసెంబరు 1 ఏపీ సర్కారు మొత్తం పోలవరం పూర్తి చేయడానికి పెట్టిన డైడ్ లైన్. అయినా పోలవరం పూర్తి చేయలేదు. ఆరోజు అసెంబ్లీలో పూర్తి చేస్తాం అని వ్యంగం ఆడారు కదా అని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తే వైసీపీకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఆ ట్రోలింగ్ తో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
ఇక తాజాగా డిసెంబరు 2న పోలవరానికి మరో షాక్ తగిలింది. పోలవరం ప్రాజెక్టుకు 120 కోట్లు పెనాల్టీ పడింది. నిబంధనలు అతిక్రమించినందుకు ఈ ఫైన్ వేసినట్టు తెలుస్తోంది.
‘‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు, అసలే పాలకులకు ప్రాజెక్టు అంచనాలపైనే అవగాహన లేక, రాక కుస్తీలు పడుతుంటే కరువులో అధికమాసం అన్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ వారి పెనాల్టీ 120 కోట్లట. పోలవరానికే కాక ఆంధ్రప్రదేశ్ కూ పెద్ద శరాఘాతమే. ఏమిటన్నా ఇది‘‘
అని జగన్ అభిమానులు కూడా రోదించే పరిస్థితి. జగన్ సర్కారు అంటే కేంద్రానికి కామెడీ అయిపోయింది.