జగన్ హయాంలో 108 అంబులెన్స్ ల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 108 సేవ ముసుగులో అరబిందో సంస్థ భారీ దోపిడీకి పాల్పడిందని ఆయన ఆరోపించారు. అంబులెన్స్ ల కొనుగోలు పేరుతో వందల కోట్ల రూపాయల స్కాం జరిగిందని, అయినా సరే సకాలంలో రోగులను ఆస్పత్రులకు చేర్చడంలో ఆ సంస్థ విఫలమైందని ఆరోపించారు.
2016లో ఒక్కో అంబులెన్స్‌కు లక్షా 30వేల రూపాయల చొప్పున 436 అంబులెన్స్‌ల కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. 2020లో పాత అంబులెన్స్‌లకు రెండు లక్షల 21 వేల రూపాయలు, కొత్త అంబులెన్స్ లకు ఒక లక్షా 70 వేల రూపాయలు చెల్లించే ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ రకంగా వందల కోట్ల రూపాయల భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. ఇంత దోపిడీ జరిగినా 108 వ్యవస్ధను నిర్వీర్యం చేసి గోల్డెన్ అవర్‌లో వైద్య సర్వీసులను నిర్వీర్యం చేశారని అన్నారు. గోల్డెన్ అవర్‌లో 11 నుంచి 20 శాతం రోగులను మాత్రమే ఆస్పత్రులకు చేర్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే అరబిందో 108 అంబులెన్స్ ల నిర్వహణ నుంచి తప్పుకుంది.