సీఎం జగన్ తన అనుయాయులను, అస్మదీయులను అందలం ఎక్కిస్తున్నారని విమర్శలు వస్తున్నా సంగతి తెలిసిందే. తన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన ఐఏఎస్ లు మొదలు బిజినెస్ మెన్ల వరకు అందరీకీ తగిన పదవులు పందేరం చేసి సముచితంగా గౌరవిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, కలియుగ దైవం వెంకన్న కొలువున్న తిరుమలలోని టీటీడీ బోర్డులో సైతం జగన్ తన అనుకున్నవారికే పదవులు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజాగా టీటీడీ బోర్డులో నియమితులైన 25 మంది సభ్యుల్లో పది మంది పారిశ్రామికవేత్తలుండడం, అందులోనూ జగన్ నమ్మినబంటులు ఎక్కువగా ఉండడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దేవుడి దగ్గర కూడా జగన్ స్వార్ధం చూపిస్తున్నారని, ఈ నియామకాల వెనుక చాలా పెద్ద స్టొరీనే ఉండి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 25 మందిలో పది మంది పారిశ్రామిక వేత్తలేనని, ఎక్కడెక్కడి మంద అందరికీ టిటిడిలో పదవులెందుకని ప్రశ్నిస్తున్నారు.
అందరూ కలిసి వెంకన్నకు గుండు కొట్టి నిలువు దోపిడీ చేస్తారేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడెక్కడి దొంగలందరినీ పోగేసి తెచ్చి మా ఆంధ్రలో వేశారని, అయినా, పైనున్న ఆ వెంకన్నే అన్నీ చూసుకుంటాడని చివరకు దేవుడిపై భారం వేస్తున్నారు. అన్ని విభాగాలు అయిపోయి చివరకు దేవుడి మీద పడ్డ జగన్ అండ్ కో జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఈ పేర్లు వైరల్ అవుతున్నాయి. టీటీడీలో పాగా వేసిన జగన్ ‘కేసు’ గాళ్లు…అంటూ ట్రోలింగ్ జరుగుతోది.
శ్రీనివాసన్ – ఇండియా సిమెంట్స్, జగన్ కేసుల్లో ఉన్నాడు
జూపల్లి రామేశ్వరరావు – మై హోం, టీ.వీ 9.
పార్థసారధి రెడ్డి – హెటిరో, జగన్ కేసుల్లో ఉన్నాడు
మన్నె జీవన్‌రెడ్డి – ఎం.ఎస్.ఎన్ ల్యాబ్స్, ఫార్మా కంపెనీ. విజయసాయిరెడ్డి తో సంబంధాలు
విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ, అరబిందో తో వ్యవహారాలు
బూదాటి లక్ష్మీనారాయణ – సాహితీ గ్రూప్ చైర్మన్. రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ కు సంబంధించిన కేసులున్నాయి. జగన్ గురువు స్వరూపానంద రికమెండేషన్.
రాజేశ్ శర్మ – ముంబై కు చెందిన Capri Global అధినేత, పారిశ్రామికవేత్త…LIC హౌసింగ్ స్కాంలో సీ.బీ.ఐ కేసు ఉంది
సౌరభ్ – కలకత్తా కు చెందిన పారిశ్రామికవేత్త.
టంగుటూరు మారుతి ప్రసాద్ – ప్రొద్దుటూరు ఎమ్.ఎల్.ఏ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సిఫారసు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి – వీ. పీ.ఆర్ మైనింగ్ డైరెక్టర్, వైసీపీ రాజ్యసభ ఎం.పీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బంధువు.
కేతన్ దేశాయ్ – మాజీ మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా చైర్మెన్, MCI లో ఉండగా నేరాలు చేసి అరెస్ట్ అయ్యాడు.
పోకల అశోక్‌కుమార్ – వైసిపీ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి బినామీ అనే ప్రచారం ఉంది.
సనత్ కుమార్ – ఆడిటర్
అల్లూరు మల్లేశ్వరి – రాజోలు మాజీ ఎమ్.ఎల్.ఏ, జనసేన నుంచి వైసీపీకి వచ్చిన అల్లూరు కృష్ణంరాజు సతీమణి. ఇది రాజకీయ పునరావాస కేటాయింపు.
మల్లాడి కృష్ణారావు – పాండిచ్చేరి లో దందాలు, కాకినాడ లో భారీగా అక్రమ ఆస్తులు. మొన్న ఎన్నికల ముందు, రాజకీయ జన్మ ఇచ్చిన కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి, ప్రభుత్వాన్ని పడేసి, బీజేపీ కి సహకరించాడు. బీజేపీ ఆదేశాల మేరకు, మొన్న పాండిచ్చేరి ఎన్నికల్లో, భారీగా డబ్బులు ఖర్చు చేసింది మల్లాడి ద్వారా జగన్ అనే ప్రచారం ఉంది.
నందకుమార్ (ఎమ్.ఎల్.ఏ) – తమిళనాడు ఎమ్.ఎల్.ఏ
శశిధర్ – కర్ణాటక మాజీ సీ.యం యడ్యూరప్ప మనవడు
విశ్వనాథ్‌రెడ్డి (ఎమ్.ఎల్.ఏ) – ఎలహంక ఎమ్.ఎల్.ఏ – బీజేపీ. జగన్ బెంగుళూరు ప్యాలెస్ ఉంది ఇక్కడే
మిలింద్ – శివసేన కార్యదర్శి, ఉద్ధవ్ థాకరే అత్యంత సన్నిహితుడు
ఎస్.శంకర్ – కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సిఫారసు
వైసీపీ ఎమ్.ఎల్.ఏ లు, మంత్రి పదవి రాని వాళ్ళు
కాటసాని రాం భూపాల్ రెడ్డి(పాణ్యం ఎమ్.ఎల్.ఏ). ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ లెక్కలేనన్ని కేసులు.
బుర్రా మధుసూదన్ యాదవ్ (కనిగిరి ఎమ్.ఎల్.ఏ). ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 2 క్రిమినల్ కేసులున్నాయి.
* కిలివేటి సంజీవయ్య (ఎమ్.ఎల్.ఏ). దళిత ఎమ్.ఎల్.ఏ, గొల్ల బాబూరావు టీ.టీ.డీ సభ్యత్వం తిరస్కరించడంతో, కిలివేటి సంజీవయ్య ను తీసుకున్నారు.
కేసీఆర్ సిఫారసు
* మురంశెట్టి రాములు
* కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్.ఎల్.ఏ)
* కన్నయ్య – ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం.తమిళనాడుకు చెందిన కన్నయ్య పై పలు అభియోగాలు. 2018 లో పీ.ఎం.వో ఆదేశాలతో కన్నయ్య పై సీబీఐ విచారణ కోరిన రైల్వే విజిలెన్స్ శాఖ. రూ.1,500 కోట్ల అక్రమ ఆస్తులు కన్నయ్య కలిగి ఉన్నట్లు అభియోగాలు.
కన్నయ్య చైర్మన్‌గా ఉన్న రైల్వే సొసైటీకి సంబంధించి మరో 108 కేసులు పెండింగ్