జనం వద్ద నటించడంలో ఆస్కార్ నటులు కూడా జగన్ వద్ద పనికిరారు.
సందర్భానుసారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆవేదనకు గురవుతుంటారు.
తద్వాారా ఆయన పాలనలో జరిగిన తప్పుల్ని మాఫీ చేసుకునే గట్టి ప్రయత్నం తరచు కనిపిస్తుంటుంది.
గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల కేవలం గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల తిరుపతిలో 11 మంది చనిపోయారు. వాస్తవానికి 25 మంది అని వార్తలు వస్తున్నాయి. కానీ ఆధారాలు లేవు.
ఆ మరణాలకు కారణమైంది గవర్నమెంట్ కాబట్టి జగన్ ముందు వారి కుటుంబాలకు సారీ చెప్పాలి.
అలా చేయకపోగా ఖజానాలో కొన్ని డబ్బులు తీసి ఇచ్చి వారి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తాడు.
రాష్ట్రంలో ఎవడైనా డబ్బుకు అమ్ముకుపోతాడు అన్నది జగన్ విశ్వసించే సిద్ధాం.
పోనీ అదైనా సరిగా చేస్తాడా అంటే లేదు.
తన బంధువులకు సంబంధం ఉన్న ఎల్జీ పాలిమర్స్ మృతులకు రూటి కోటిచ్చాడు జగన్.
కానీ రుయాలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిసి వేసిందన్న ఆయన.. మరణించిన కుటుంబాలకు ప్రకటించిన పరిహారం విస్మయానికి గురి చేసేలా ఉంది. ఎందుకంటే.. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు రూ.కోటి సాయం లేదంటే రూ.50లక్షల సాయాన్ని ప్రకటిస్తారు.
బాధిత కుటుంబానికి జరిగిన నష్టంతో పోల్చినప్పుడు.. ఎంతిచ్చినా తక్కువే.
రుయా ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్నంగా రూ.10లక్షలకే పరిమితం కావటం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంత పెద్ద వ్యవస్థ ఉండి… ఎక్కడ ఎంత ఆక్సిజన్ నిల్వ ఉంది అన్న విషయం కూడా తెలియకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు అంటే…. సీఎంకు పరిపాలన మీద ఏం అవగాహన ఉన్నట్టు, ఆయన ఏదైనా జరిగితే తప్ప కనిపెట్టలేడు అన్న భరోసా వల్లే ఉద్యోగులు, అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.
అయినా అనుభవం లేమి ఒక కారణం అయితే… ప్రభుత్వ ప్రాథమ్యాలు కూడా వేరేవి కావడం ఈ మరణాలకు ప్రధాన కారణం.