మాజీ మంత్రి, టీడీపీ నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీపైనిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పారు. 356 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వా నికి సమయం ఉందని గంటా వ్యాఖ్యానించారు. ఇక రోజులు లెక్కపెట్టుకోవడమే తరువాయి అని వ్యంగ్యా స్త్రాలు రువ్వారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి.. లోపాయి కారీగా స్వప్రయోజనాల కోసం మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.
విశాఖలో పేర్లు మార్పిడి పరంపర కొనసాగుతోందని గంటా విమర్శించారు. `సీత కొండ` వ్యూ పాయింట్‌కు, వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా పేరు మార్చడం సరైనది కాదన్నారు. ఆ ప్రాంత మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని, అవసరమైతే జాతి నాయకుల పేర్లు పెట్టాలని కోరుతున్నామన్నామని గంటా శ్రీనివాసరా వు అన్నారు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండుటెండలో సైతం లోకేష్ పాదయాత్ర విజయవం తంగా నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 1/4 పూర్తయిందన్నారని తెలిపారు. పాదయాత్రలో లోకేష్ పరిపూర్ణమై న నాయకుడిగా రూపు దిద్దుకుంటున్నారని కొనియాడారు. అందరి ఆశీస్సులు లోకేష్‌కు ఉండాలని కోరుతున్నానన్నారు. చేసిన అభివృద్ధిపై సెల్ఫీ చాలెంజ్ పెడుతున్నారని ఇది యువతను బాగా ఆకర్షిస్తోందని గంటా చెప్పారు.బాబాయి వివేకా హత్య ఉదంతం, బయటపడుతుందని సీఎం జగన్ లండన్ టూర్ రద్దు చేసుకున్నారని గంటా దుయ్యబట్టారు. విశాఖపట్నం, రాజమండ్రి జైళ్లలో ఏం అవసరమైతే అవి ఇప్పుడే మరమ్మతులు చేయించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.