విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబందించి దాదాపు ఓ వారం రోజులు తీవ్ర హడావుడి చేసింది తెలంగాణ ప్ర భుత్వం. మంత్రులు కూడా పరస్పరం దూషించుకున్నారు.
ఇక, ఏపీ ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చా యి. ఇలాంటి సమయంలో నూ వెనక్కి తగ్గకుండా.. విశాఖ ఉక్కును తామే కొనేస్తామన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేయించారు.
తీరా చూస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియకు అసలు తలంగాణే దూరంగా ఉండిపోవడం గమనార్హం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ముడిపదార్థాలు లేదా మూల ధనం సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ప్రె షన్ ఆఫ్ ఇంట్రస్ట్-ఈవోఐ కోరిందిద. మొత్తం 29 దేశ, విదేశీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
ఈ క్రమంలో నే తెలంగాణ ప్రభుత్వం కూడా.. బిడ్ వేసేందుకు రెడీ అవుతోందని పెద్ద ఎత్తున విశ్లేషణలు వచ్చాయి. కానీ, చివరి నిముషం వరకు టెన్షన్ పెంచేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బిడ్ దాఖలు చేయలేదు.
వాస్తవానికి కేసీఆర్ నిర్ణయంతో కేంద్రం వణికిపోయిందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందం టూ తెలంగాణ మంత్రులు గొప్పలకు పోయారు. పది రోజులకుపైగా హడావుడి చేశారు.
ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల నాయకులు మాటల యుద్ధంతో రాజకీయ లబ్ధికి ప్రయత్నించారు.
చివరకు.. అందరూ కలిసి విశాఖ ఉక్కు మరిచిపోయారని అంటున్నారు కార్మికులు. నిజానికి ఈ నెల 15 నాటికే ఈవోఏ గడువు ముగిసిపోయింది.
మరో ఐదు రోజులు సమయం కావాలని సింగరేణి విజ్ఞప్తి చేసింది.
దీంతో కేంద్రం మరో ఐదు రోజులు గడువు పెంచింది. అది కూడా ముగిసింది.
అయినా సింగరేణి, తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు కాలేదు. తొలుత హడావుడి చేసి.. ఇప్పుడు బిడ్డింగ్‌కు దూరంగా ఉండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది.ఇదే సమయంలో విశాఖ ఉక్కుకు ముడిపదార్థాలు లేదా మూలధనం కావాలని దానిని సమకూర్చిన సంస్థలు అందుకు బదులుగా ఉక్కును తీసుకోవచ్చని ఈవోఐలో కేంద్రం పేర్కొంది.
దీంతో తమ ప్రాజెక్టులకు అవసరమైన ఉక్కును తీసుకునేందుకు వీలుగా సింగరేణి బొగ్గును పంపించాలాని కేసీఆర్ భావించారు. కానీ, ఇది అనూహ్యంగా అటకెక్కడం గమనార్హం.
అంతిమంగా కేసీఆర్ విశ్వసనీయతపైనే ఇది ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.