టాలీవుడ్ లోని హీరోలలో భీకరమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా ఎదిగారని వీరిద్దరికీ ఇండస్ట్రీలో పేరుంది. ఇటువంటి ఇద్దరు మాస్ హీరోలు గతంలో అన్నయ్య సినిమాలో కలిసి నటించారు. అప్పటికి రవితేజ పూర్తి స్థాయి హీరో కాదు. రవితేజ మాస్ మహారాజాగా ఎదిగిన క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతోన్న సినిమా వాల్తేరు వీరయ్య.
చాలాకాలం తర్వాత చిరు నుంచి పక్కా మాస్ ఎంటర్ టైనర్ రాబోతుండడం, అందులో రవితేజ కూడా నటించబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ డబుల్ మాస్ ధమాకా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు రవితేజ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, మెగా మాస్ సాంగ్ దుమ్మురేపుతున్నాయి. మరో నెల రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న క్రమంలోనే తాజాగా ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రవితేజ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేశారు.
‘అతని బ్యాక్ గ్రౌండ్ కేవలం హార్డ్ వర్క్. అతని సపోర్ట్– ప్రేమించే మాస్’ అంటూ రవితేజ పాత్రను పరిచయం చేస్తూ చిరంజీవి స్వయంగా ట్వీట్ చేశారు. ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో పవన్ ఫుల్ పోలీసోడిగా రవితేజ నటిస్తున్నారు. ఒక చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలి పట్టుకొని విలన్లతో ఫైట్ చేస్తున్న రవితేజ అదరగొట్టారు.
‘ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తాంది’ అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. ‘ఏమిరా వారి పిస పిస జేస్తున్నవ్. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వని అయ్యకీ ఇననని’ అంటూ తెలంగాణ యాసలో రవితేజ చెప్పిన డైలాగ్ మాస్ కు పూనకాలు తెప్పిస్తోంది.