టీడీపీలో ఫైర్ బ్రాండ్లు చాలా మంది ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి విపక్షంవైసీపీపై నిప్పులు చెరిగిన వారు చాలా మంది ఉన్నారు.
అయితే.. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. వారంతా సైలెంట్ అయిపోయారు.
అయితే.. చింతమనేని ప్రభాకర్.. వంటివారు.. ఒకింత ఫైర్ అయినా.. ఆయన పై కేసులు పెట్టారు.
ఫలితంగా అనేక సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో చాలా మంది ఫైర్ బ్రాండ్ మనకెందుకులే అని సరిపుచ్చుకున్నారు.
మరోవైపు… ఎన్నికలకు సమయం ముంచుకు వస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు తరుముతున్న పరిస్థి తి ఉంది.
దీంతో ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా.. ఫైర్ బ్రాండ్లు తెరమీదికి వస్తున్నారు.
తాజాగా.. గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనేక మంది నాయకులు తరలి వచ్చారు.
వాస్తవానికి గుడివాడకు రాకుండా.. పోలీసులు అనేక రూపాల్లోఅడ్డంకులు సృష్టించారు. అయినా.. వారు కదలి వచ్చారు.
ముఖ్యంగా గురజాల ఫైర్ బ్రాండ్..యరపతినేని శ్రీనివాసరావు, దెందులూరు ఫైర్ బ్రాండ్.. చింతమనేని ప్రభాకర్.. ఏలూరు ఫైర్ బ్రాండ్.. మాగంటిబాబు.. ఇలా..అనేక మంది పోలీసుల వలయాన్ని కూడా దాటుకుని.. గుడివాడకు చేరుకున్నారు.
రైతులకు మద్దతు తెలిపారు. ఈ పరిణామం.. టీడీపీలో నూతన ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.
ఎందుకంటే.. ఇప్పటి వరకు చింతమనేని ఒక్కరే ఎక్కడ ఏం జరిగినా.. వాలిపోతున్నారు. మిగిలిన నాయకులు పెద్దగా స్పందించడం లేదని… చంద్రబాబే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు.. అందరూ సమష్టిగా.. ముందుకు రావడం.. పార్టీని ముందుకు నడిపించేందుకు కంకణం కట్టుకోవడం.. పార్టీలో ఆసక్తిగా మారాయి.
ఇదే దూకుడు వచ్చే రెండేళ్లపాటు కొనసాగిస్తే.. పార్టీ ఒంటరిగానే బరిలో నిలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.
గెలుపుగుర్రం ఎక్కడం కూడా ఈజీయేనని చెబుతున్నారు.