టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర 3 రోజుల పాటు సాగనుంది. తొలిరోజు పాదయాత్ర సందర్భంగా లోకేష్ 8.5 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో తన ఇంటిని అధికారులు అన్యాయంగా కూల్చివేశారు అంటూ ఒక మహిళ …లోకేష్ వద్ద వాపోయింది.
జాబ్ క్యాలెండర్ రాలేదని, తమకు ఉద్యోగాలు రాలేదని యువత… లోకేష్ ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ క్రమంలోని తొలి రోజు పాదయాత్ర సందర్భంగా తనను కలిసి బాధలు చెప్పుకున్న వారి గురించి లోకేష్ జనవాణి పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. తనను కలిసి సమస్యలు విన్నవించుకున్న వారి గురించి లోకేష్ ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు, వారి సమస్యలకు కారణమైన జగన్ పై లోకేష్ పలు ప్రశ్నలు సంధించారు. జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకొని ఆ లేఖలో లోకేష్ ప్రస్తావించారు.