• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

admin by admin
January 28, 2023
in NRI
0
0
SHARES
36
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో సహసమర్పణలో గురువారం సాయంత్రం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిల్పిటాస్ నగరంలో ఘనంగా జరిగాయి. ఇది వారాంతం కాకపోయినప్పటికీ 200 పైచిలుకు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు.

డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర కార్యకర్తలు కిరణ్ సింహాద్రి, లలిత అయ్యగారి స్వాగత వచనాలతో, కుమారి ఈశా తనుగుల ప్రార్థనాగీతంతో సభ ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 74 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని, భారత ప్రభుత్వం చేస్తున్న,చేయబోతున్న కార్యక్రమాలను సభికులకు వివరించారు. ముఖ్యంగా అనేక అమెరికా విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ కోర్సులను ప్రవేశపెట్టడానికి ఉత్సుకత చూపిస్తున్నాయని అలానే భారతీయ విశ్వవిద్యాలయాలు కూడా అమెరికాలో తమ శాఖలను ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

ప్రాంతీయంగా ఉన్న అనేక భారతీయ రాష్ట్రాల సంస్థలు, వారి సభ్యులు, వారి వారి భాషల్లో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ విభిన్న భాషా, సంస్కృతుల సమాహారమై భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పే భారతీయతను ప్రేక్షకులకు చవిచూపించారు. భారతి తమిళ సంఘం, మలయాళీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ప్రవాసి బెంగాలీ అసోసియేషన్, రాజస్థాన్ అలయన్స్ ఆఫ్ నార్త్ అమెరికా, ఉత్తరప్రదేశ్ మండల్ ఆఫ్ అమెరికా, తదితర సంస్థల సభ్యులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ భారతీయులు అమెరికాకు వలస రావడం మొదలై 100 సంవత్సరాలు పైబడుతున్నా ఇప్పటివరకు ఎవరూ సాహసించనిది, సిలికానాంధ్ర మాత్రమే సాధించినది, భారతీయ విలువలతో ఉన్నత విద్యను అధ్యయనం చేసే అవకాశం కల్పించే అమెరికా విశ్వవిద్యాలయ స్థాపన చెయ్యడమని అదే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయమని సబికుల హర్షాతిరేకాల మధ్య తెలియజేశారు. ఈ విశ్వవిద్యాలయంలో ఇప్పటికే కూచిపూడి, భరతనాట్యం కర్ణాటక సంగీతం, హిందుస్తానీ మరియు తెలుగు, సంస్కృతం లలో సర్టిఫికెట్, డిప్లమా, మాస్టర్స్ డిగ్రీ కోర్సులు ఉన్నాయని ఈ సెప్టెంబర్ నుంచి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు.

మిల్పిటాస్ నగర కౌన్సిల్ మెంబర్ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి నగర అడ్మినిస్ట్రేషన్ తరుపున అభినందన పత్రాన్ని అందజేశారు. రెండు గంటల పైన జరిగిన ఈ అందమైన సభ నిర్వాహకులు అతిధులకు ఏర్పాటుచేసిన విందు భోజన కార్యక్రమంతో ముగిసింది సిలికానాంధ్ర కార్యకర్తలు మువ్వన్నెల జెండాలతో, మూడు సింహాల గుర్తులతో ఆకర్షణీయంగా ఏర్పాటుచేసిన ఫోటో బూత్ లో సభికులందరూ ఫోటోలు తీసుకుంటూ, ఈ అనుభూతిని కలకాలం పదిలపరచుకోవడం కొసమెరుపు.

కార్యక్రమం విజయవంతం కావడం కోసం విశేష కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు సాయి కందుల, దిలీప్ సంగరాజు, శివ పరిమి, గిరి తనారి, శ్రీరామ్ కోట్ని తదితరులకు కాన్సుల్ జనరల్ తన అభినందనలు తెలియజేశారు.

Tags: nrisrepublic day celebrationssilikanandhrasilikanandhra universityUSA
Previous Post

వైసీపీది `సామాజిక అన్యాయం: లోకేష్`

Next Post

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

Related Posts

NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
NRI

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

March 11, 2023
NRI

TANA-కొలంబస్ లో ఘనంగా ముగిసిన ‘తానా’ 23వ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్’!

February 28, 2023
Load More
Next Post

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra