తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే కేసీఆర్ మొగ్గు చూపిస్తారనే సమాచారం ఉందన్నారు.
నిజంగానే బీజేపీకి, మోడీకి.. కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ రువ్వారు. కానీ, అలాంటివేవీ చేయకుండా.. ఫామ్ హౌస్‌లో పడుకునే సీఎం.. బీజేపీని వ్యతిరేకిస్తున్నారంటే.. స్కూల్ పిల్లలు కూడా నమ్మడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము నిరసన తెలిపితే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కేంద్రం, ఈడీ తీరుకు నిరసనగా రేపు రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ ఉంటుందని, రేపటి ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీకి సాయం చేస్తారని పేర్కొన్నారు. కలిసి పనిచేద్దామన్న కేసీఆర్.. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అలా నిలబెట్టక పోతే.. ఆయన బీజేపీ మనిషిగానే భావించాల్సి ఉంటుందని.. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లు కిందే లెక్కగడతామని ఆయన పేర్కొన్నారు.
“రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా బీజేపీకి సాయం చేస్తారు. కలిసి పనిచేద్దామన్న కేసీఆర్ మమత సమావేశానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా?“ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం కేసీఆర్ ఏం చేస్తారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. ప్రధాని మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారన ఎద్దేవా చేశారు. నైతిక విలువలు లేని నేత కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కలిసి పనిచేద్దామని ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమత దగ్గరకెళ్లిన కేసీఆర్.. ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి ఎందుకు వెళ్లలేదు? అని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కేసీఆర్ వ్యతిరేకమంటున్నారని, బీజేపీకి కూడా వ్యతిరేకమైతే అభ్యర్థిని దింపుతారా అని నిలదీశారు.
కాంగ్రెస్‌ను చూపి కేసీఆర్ బీజేపీకి లొంగడం మొదటిసారేం కాదన్నారు. ప్రధాని మోడీని వ్యతిరేకించేవారితో కేసీఆర్ కలవరని తేలిందని విమర్శించారు. ఈడీ పేరుతో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌ను బీజేపీ వేధిస్తోందని తప్పుబట్టారు. దీనికి నిరసనగా రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు.