విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అన్నగారు స్థాపించిన పార్టీ కోసం గత మూడు దశాబ్దాలుగా ఎందరో కార్యకర్తలు, నేతలు అలుపెరగని శ్రామికులుగా పనిచేస్తున్నారు. టిడిపి అంటే నిబద్ధత అని చాటి చెప్పేలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా టిడిపి జెండా రెపరెపలాడించాలని ప్రతి కార్యకర్త ఉవ్విళ్లూరుతుంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ జెండాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్ట్ శిఖరంపై రెపరెపలాడించారు గింజుపల్లి శివప్రసాద్ అనే టీడీపీ కార్యకర్త. 80 ఏళ్ల వయసులోనూ శివప్రసాద్ కేవలం పార్టీపై అభిమానంతోనే 5000 మీటర్ల ఎత్తు వరకు ఎవరెస్ట్ అధిరోహించడం విశేషం. ఈ వయసులో కూడా పార్టీపై అభిమానంతో ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్టు అధిరోహించిన శివప్రసాద్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే శివప్రసాద్ ను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. గతంలో శివప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. గతంలో తాను చేపట్టిన ‘వస్తున్నా నీకోసం’ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని ఆయన నిరూపించారని, యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. శివప్రసాద్ ఎవరెస్టు మీద టిడిపి జెండాను రెపరెపలాడించిన వీడియోను కూడా చంద్రబాబు ట్విటర్ లో షేర్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని, విజన్ ఉన్న చంద్రబాబు వంటి సమర్ధుడైన నాయకుడిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ వీడియోలో శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ వయసులో కూడా పార్టీపై అభిమానంతో ఎవరెస్ట్ ను అధిరోహించిన శివప్రసాద్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎనభై ఏళ్ళ వయసులో ఎవరెస్టు శిఖరాన్ని 5000 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి… అక్కడ తెలుగుదేశం ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న గింజుపల్లి శివప్రసాద్ గారికి అభినందనలు. నేను గతంలో చేసిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో నాతో కలిసి శివ ప్రసాద్ గారు అడుగులేసారు(1/2) pic.twitter.com/vnlExtO8bw
— N Chandrababu Naidu (@ncbn) October 8, 2022