• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైఎస్ వివేకా కేసులో కీల‌క సాక్షి మృతి.. ఎన్నో అనుమానాలు!

admin by admin
June 10, 2022
in Uncategorized
0
0
SHARES
57
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి  చెందారు. ఈ ఘ‌ట‌న తీవ్ర సంచలనమైంది. హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఆయన మృతి చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి  వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో.. ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

ఆయన అనారోగ్యంతో చనిపోయారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఈ మరణం తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. వివేకా హత్యకేసు దర్యాప్తునకు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన సీబీఐ బృందా లు ఇటీవలే మళ్లీ కడప చేరుకున్నాయి. గత మూడు రోజులుగా పలువుర్ని విచారిస్తున్నాయి. రెండురోజుల కిందట పులివెందులలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్‌ కో ఆర్డినేట్స్‌ తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి మరణించటం చర్చనీయాంశమైంది.

కీల‌క సాక్షి.. ఎలాగంటే..

‘కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించాం. ఆ నేరాన్ని నీపైన వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారు. నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తాం’ అంటూ ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనకు ఆఫర్‌ ఇచ్చారని గతేడాది అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఇది సీఎం జగన్‌ బాబాయ్‌ హత్య కాబట్టి, తేడా జరిగితే భవిష్యత్తులో ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ని తాను తిరస్కరించా నని ఆయన ఆ వాంగ్మూలంలో వివరించారు. తర్వాత ఏమైందో కానీ కొన్ని రోజులకే మాట మార్చారు.

శివశంకర్‌రెడ్డి, ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యే గంగాధర్‌రెడ్డి మాటమార్చారనే అనుమానం తమకు ఉందని శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టుకు సీబీఐ నివేదించింది. ‘గంగాధర్‌రెడ్డి మాకు ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలను న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు గతేడాది నవంబరు 25న అంగీకరించారు. 27న వాంగ్మూలం నమోదు కోసం న్యాయస్థానంలో సీబీఐ తరఫున దరఖాస్తు చేశాం. 29న ఆయన మాట మార్చారు. శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ తనను బలవంతం చేసిందని, ఒత్తిడి తెచ్చిందంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయనను శివశంకర్‌రెడ్డి ప్రభావితం చేశారు’ అని కోర్టుకు సీబీఐ తెలిపింది.  ఈ మొత్తం ప‌రిణామాల నేప‌థ్యంలో గంగాధ‌ర్‌రెడ్డి మృతి అనేక అనుమానాల‌కు ఛాన్స్ క‌ల్పించింది. మ‌రి దీనిపై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags: CBIkadapays sunitha reddyys viveka's murder caseys vivekananda reddy
Previous Post

వైసీపీది అధర్మ యుద్దం.. విలువలు లేవ్ : చంద్ర‌బాబు

Next Post

ఓట‌మి అంచుల్లో వివాదాస్పదులు ?

Related Posts

Uncategorized

NRI TDP-ఎన్నారై టిడిపి ద్వారా డిగ్రీ చదువుకున్న 17 మందికి మంగళగిరి స్టార్ట్ అప్ కంపెనీలో ఉద్యోగాలు!

March 2, 2023
Uncategorized

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందంతో ప్రవాస భారతీయుల సమావేశం!

February 25, 2023
Top Stories

కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?

February 3, 2023
Top Stories

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

January 28, 2023
Uncategorized

పొంగులేటి రాక ఆలస్యం ఎందుకు జరుగుతుంది.??

January 21, 2023
Uncategorized

గుంటూరు మృతుల కుటుంబాలకు 10,00,000( పది లక్షల రూపాయలు) ఆర్ధిక సాయం అందజేసిన మన్నవ మోహనకృష్ణ!

January 21, 2023
Load More
Next Post

ఓట‌మి అంచుల్లో వివాదాస్పదులు ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra