ఆరోజు..!
జనవరి 27 పాదయాత్ర మొదలవుతుంది..!
ఉదయం 8:30 గంటలకు కేంప్ సైట్ కుప్పం గెస్ట్ హౌస్ కి చేరుకోవటం జరిగింది.
జనం అప్పుడప్పుడే మెల్లగా చేరుకుంటున్నారు..!
అయినా ఆశించినంత..నేను ఊహించినంతగా జనం కనబడలేదు..!
కాసేపటికి రాష్ట్రం నలుమూలలనుండి నాయకులు..కార్యకర్తలు వచ్చిచేరుకుంటున్నారు..!
సంతృప్తికరంగా లేదు..!
బాలయ్య సమేత లోకేష్ గారు దేవస్ధానంలో పూజలు నిర్వహించి..యాత్ర తొలిఅడుగు వేసారు.
కార్యకర్తల బలం ఉన్న పార్టీ కాబట్టి సందడికి కొదువలేదు.
మధ్యాహ్నం దాటిన తర్వాత సభ..!
ఎండ పెళ్ళుమని కాస్తుంది..!
మంటెక్కిపోతుంది..!
పోలీసులు పట్టించుకోక ట్రాఫిక్ గందరగోళం..!
సభలో పాతికవేలమంది ఉంటే బయట రోడ్లమీద మరొక పాతికవేలమంది ఉంటారు.
అనేక భోజనాలకొరకు శిబిరాలు ఏర్పాటు చేసారు..!
మంచినీరు..మజ్జిగ పేకెట్లు..భోజనాలు బాగా అరేంజ్ చేసారు.
తారకరత్న అపశ్రుతి..ఆందోళన..ఏంజరుగుతుందో అన్న భయం..అంతా గందరగోళం కాసేపు..!
ఆయనకు ప్రాధమిక చికిత్స చేసి..బెంగుళూరు తరలించాక ఊపిరిపీల్చుకోవటం జరిగింది.
ఆ సాయంత్రం పాదయాత్ర ముగిసిన తర్వాత..లోకేష్ గారి విడిది వాహనంలో కలవటం జరిగింది.
మొదటిరోజు యాత్ర..సభ జరిగిన తీరు..స్పందన గురించి మాట్లాడటం జరిగింది.
ఆయన చాలా శ్రద్దగా విన్నారు..!
అలాగే లోకేష్ గారు మాట్లాడిన విధానం డౌన్ టు ఎర్త్..బిహేవియర్..!
ఎవ్వరినైనా ఆకట్టుకుంటుంది..!
కుప్పం పరిధి వరకు ఒకలెక్క ఆపైన మరొకలెక్క అన్నారు..!
అన్నట్టుగానే ఆయన తన యాత్ర కొనసాగించారు..!
నేను గాని ఇంకా చాలా మంది ఊహించిన దానికంటే..అంచనాలను మించి ఆయన యాత్ర కొనసాగింది.
దారి పొడవునా అడ్డంకులు..కవ్వింతలు..కేసులు..!
చాలా సహనం సంయమనం పాటించారు.
అదే సమయంలో ఉగ్రనరసింహావతారం చూపించారు.
విద్యార్ధులు..యువత..వృత్తి నిపుణులతో సమావేశాలు..!
పరిణితి చెందిన నాయకుడి మాదిరి అతను నిర్వహించిన తీరు ఆకట్టుకున్నది.
మొదట్లో శీతకన్ను వేసిన ప్రధాన మీడియా..మెల్లమెల్లగా యువగళం వార్తలు..ప్రసారాలు మొదలయ్యాయి.
జనం స్పందన రోజురోజుకి పెరుగుతుంది..!
ఆబాల గోపాలమూ లోకేష్ అడుగులో అడుగు వేస్తున్నారు.
నాయకులు నిత్యం వచ్చి కలుస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర పాలకులకు కంటగింపుగా మారుతూ వస్తుంది.
సెల్ఫీ ఛాలెంజ్ వారికి పుండు మీద కారం చల్లినట్టు ఉంటున్నది.
సెల్ఫీ విత్ లోకేష్ ఒక సంచలనం..స్పందన అనూహ్యం..ఆయన ఓపిక అనన్యసామాన్యం..!
సీమ దాటకుండానే ఫలితం కనబడింది..!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..మూడుకి మూడు గెలుచుకున్నారు..!
వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకం..స్పష్టమైన హామీ..!
ఇది విన్నూత్నం..!
రోజురోజుకి పెరుగుతున్న జనాల జాతర.!
రాజకీయ పండితులకు ఆశ్చర్యం..!
ప్రత్యర్ధులకు దిగ్భ్రాంతి..!
సీమ దాటేసరికే..మాస్ లీడర్ విత్ టచ్ ఆఫ్ క్లాస్ గా మారిపోయాడు..!
నెల్లూరు నుండి ఆయన్ని నేలమీద నడవనివ్వలేదు ప్రజలు..దారంతా పూలు పరిచారు..!
పూలవర్షం..అభిమానం ఆదరణల వర్షంలో తడిసి ముద్దయ్యాడు.
ప్రభుత్వ బాధితులు..దాడులకు అన్యాయానికి గురైన వారి బాధలు విని కరిగి నీరయ్యాడు..!
బడుగు బలహీనులకు అప్పటికప్పుడే సాయం అందించాడు.
రైతుల వెతలు..వృత్తుల వారి కష్టనష్టాలు అవగాహన చేసుకున్నాడు..!
నిర్మొహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడారు.
క్రూరులైన ప్రత్యర్ధులు..అడ్డగోలు అధికారుల భరతం పడతానని హెచ్చరించారు.
అలాంటి వారి కోసమే రెడ్ బుక్..!
పాపాల చిట్టా రడీ చేయటం మొదలుపెట్టారు.
నెల్లూరు,ప్రకాశం దాటి పల్నాడులో మరింత ఉవ్వెత్తున సాగింది..!
కృష్ణాజిల్లా తెల్లవారుఝాము వరకు నడిచారు..!
గోదావరి జిల్లాలు..ఉత్సాహం ఉరకలు వేసింది.
దాడులు తిప్పికొట్టారు..!
అప్పటికే అందరూ సెట్ అయిపోయారు..!
వెక్కిరించిన వారికి ఎక్కిళ్ళు వచ్చాయి..!
లోకేష్ దూకుడు కంటిమీద కునుకు కరువయింది..జగన్ గారికి..!
ఇంకో పక్క చంద్రబాబు గారి పర్యటనలు..!
జనాల జాతర..!
మరోపక్క జగన్ సభలు వెలవెల..!
వైనాట్ కుప్పం..వైనాట్ పులివెందులగా మారిపోయింది.
అప్పుడే కుట్రలు మొదలు పెట్టారు..!
చంద్రబాబు గారి అక్రమ అరెస్టు..!
పాదయాత్రకు బ్రేక్ పడింది..!
పాక్షికంగా జగన్ విజయం సాధించాడు..!
కాని రాజకీయంగా టీడీపికి చంద్రబాబుగారికి చాలా మేలు జరిగింది.
పెద్దాయన అన్యాయం నిర్భంధంలో ఉన్నాడన్న బాధ..!
ఆయన ఆరోగ్యం పట్ల ఆవేదన..!.
ఆయన్ని ఏమి చేస్తారో ఈ రాక్షసులు అన్న ఆందోళన..!
అప్పటి వరకు చంద్రబాబు గారికి ఇంత అభిమానగణం ఉన్నదా!?
ఇంత మంది ఆయనకోసం బయటకొచ్చి ఉద్యమిస్తున్నారా..!?
అన్నది తెలిసింది.
పార్టీలకు అతీతంగా నాయకులందరూ చంద్రబాబు నామస్మరణ చేసిన అరుదైన సందర్భం..!
మరో మేలు..!
లోకేష్ లోని నాయకత్వం..!
సమస్యలను ఎదుర్కున్న తీరు..!
అతని ధీరత్వాన్ని పరిచయం చేసింది..!
బెయిలు అనంతరం ఎక్కడ ఆగిందో అక్కడ నుండి యాత్ర మొదలయింది.
విశాఖలో ముగించారు..!
3132 కిలోమీటర్లు..!
యువగళం ముగింపు సభ..!
అది సరికొత్త చరిత్ర..!
సువిశాల ప్రాంగణం..!
హాజరయినవారి సంఖ్య రకరకాలుగా చెబుతున్నారు.
ఎవరూ దగ్గరుండి లెఖ్క పెట్టలేరు..!
కాని ప్రాంగణం కిక్కిరిసి పోయింది..!
దాదాపు రహదారి పొడవునా జనం ట్రాఫిక్ లో చిక్కుకు పోయారు.
సభకు అందుకోలేక పోయారు.
ప్రభుత్వం యధావిధిగా ఆటంకాలు కల్పించింది.
కుళ్ళుబోతుతనం ప్రదర్శించింది..!
ఆఖరుకి రైళ్ళను కూడా లూప్ లైనులోకి మళ్ళించి ఆలశ్యమయ్యేలా చూసారు.
ఆర్టీసీ బస్సులయితే అసలు ఇవ్వలేదు.
ప్రైవేటు బస్సులకు ఆంక్షలు బెదిరింపులు..!
చివరకు ఆటోలకు ఫైన్లు వేసారు.
అయినా జనం తోసుకు వచ్చారు..దూసుకు వచ్చారు.
అందుబాటు లో ఏదుంటే అదెక్కి వచ్చారు.
వేదిక..వేదిక ముందు కన్నులపండుగ..!
వేదిక మీద అరుదైన దృశ్యాలు..!
చంద్రబాబుగారు..బాలయ్య..పవన్ కళ్యాణ్ గారు..లోకేష్ గారు..!
సీనియర్ నాయకులు..యువనాయకులు..!
ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
లోకేష్ గారు అందర్నీ ఆకట్డుకున్నారు..!
ప్రసంగంలో ఛలోక్తులున్నాయి..!
ఆవేదన ఉన్నది..!
అవగాహన ఉన్నది..!
మాటల తూటాలు ఉన్నాయి.
నిప్పులు కురించే కళ్ళు..తీక్షణ ధృక్కులు..!
ప్రత్యర్ధులకు వణుకు పుట్టించాయి.
యువగళం..జనగళం..!
నవశకం..!
మరోచరిత్ర కు శ్రీకారం..!
ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు..!
✍️ అడుసుమిల్లి శ్రీనివాసరావు!