రాజకీయాల్లో వైరం ఉండాలి. కానీ, అది ఎన్నికల వరకు మాత్రమే పరిమితం కావాలి. గెలుపు గుర్రం ఎక్కి.. ప్రబుత్వం ఏర్పాటు చేశారు.. అర్జనుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టుగా ఏ పార్టీ ప్రభుత్వానికైనా రాష్ట్రం, రాష్ట్రం తాలూకు అభివృద్ధి, ప్రజల సంక్షేమం మాత్రమే కనిపించాలి. కానీ, ఏపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంపై కక్ష, టీడీపీపై అక్కసు.. అంతకుమించి.. చంద్రబాబుపై ఉన్న పగ కారణంగా.. వైసీపీ ప్రభుత్వం ఏపీని అభివృద్ధికి దూరం చేస్తోందని అన్ని వర్గాల ప్రజలు అలో లక్ష్మణా అంటున్నారు.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక కంపెనీలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయేలా చేసిందనే టాక్ ఎలానూ ఉంది. ఇటీవల తెలంగాణలో అమరరాజా కంపెనీ 3000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. వాస్తవానికి ఇది ఏపీలోనే ఉండాల్సిన ప్రాజెక్టు. కానీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందని భావించిన అమరరాజా తెలంగాణకు వెళ్లిపోయింది. ఇక, కియా కార్ల కంపెనీ కూడా… కొంత ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినా.. విడిభాగాల తయారీ కంపెనీని తమిళనాడుకు తరలించేసింది.
దీనికి కారణం… ప్రజా ప్రతినిధుల నుంచి వేధింపులేనని ఆరోపణలు వినిపించాయి. ఇక, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో లూలూ గ్రూపు సంస్థ 3000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో మల్టీ బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించింది. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక.. అక్రమాలు జరిగాయంటూ.. ఆ భూముల కేటాయింపును రద్దు చేశారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు లూలూ సంస్థల్ని సాదరంగా ఆహ్వానించి వారి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టించాయి.
వైసీపీ ప్రభుత్వం లులు గ్రూప్‌ను వెళ్లగొడితే… తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వారిని ఆహ్వానించిం ది. అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు 2022 మార్చి 28న దుబాయిలో లులు గ్రూప్‌కి, తమిళనాడు ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది. దానిలో భాగంగా తొలివిడతలో కోయంబత్తూరులో నిర్మించిన హైపర్ మార్కెట్‌ను తాజాగా ప్రారంభించారు. తమిళనాడులో లులు గ్రూప్.. చెన్నైలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం సహా పలు ప్రాజెక్టుల్లో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది. ఇదే విషయాన్ని నెటిజ న్లు కూడా పేర్కొంటూ… వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్(వైజాగ్) నుండి తరిమేసిన లులు గ్రూప్ కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన హైపర్ మార్కెట్ ఇది…
జగన్ రెడ్డిది ఏం పోయింది నష్టపోయింది విశాఖ యువత, కదా.4800 మందికి ఉద్యోగాలు ఇవ్వగల సంస్థని తరిమేశాడు ఈ తుగ్లక్ రెడ్డి#YCPDestroyedAP pic.twitter.com/S4YIl9gYxZ
— Vikas Kanumuri (@KanumuriVikas) June 18, 2023