పి.గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గారు కారు ను అడ్డగించి మరి వినతి పత్రం అందించిన అయినవల్లి మండల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు..???????????? pic.twitter.com/IhZUWuh3WO
— JSP (@konaseemammayi) July 9, 2021
ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇటీవల వరుసగా పలువురు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగలు, తిరుగుబాట్లు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులపై ప్రజలు ఎమ్మెల్యేలను బహిరంగంగానే నిలదీస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అక్కడ ప్రజలు, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని అమరావతి నుంచి మారుస్తామన్న ప్రకటనలు వచ్చినప్పటి నుంచే ఆళ్ల, శ్రీదేవి జనాల్లోకి వెళుతుంటూ ఏదో ఒక నిరసన వ్యక్తమవుతూనే ఉంది.
ఇక వీరిద్దరిలో శ్రీదేవికి నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆమె ఇటీవల రెండు నెలల గ్యాప్ తర్వాత నియోజకవర్గంలోకి వస్తే ఆమెను రైతులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.
ఈ నిరసనలు రాజధాని ఏరియాలో మాత్రమే కాదు.. ఉత్తరాంధ్రలోనూ కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడును ప్రజలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గ్రామంలో అందరికి కాకుండా .. తన వర్గానికి చెందిన వారికే ఇళ్లు ఇవ్వడాన్ని నిరసించిన గ్రామస్తులు ఆయన్ను కారు దిగనీయకుండా అడ్డుకున్నారు.
చివరకు ఆయన్ను తరమడంతో ఆయన పోలీసులు సహకారంతో అక్కడ నుంచి తప్పించుకున్నారు. అప్పలనాయుడు జగనన్న కాలనీకి శంకుస్థాపన చేయకుండానే వెళ్లిపోయారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు కి ఘోర పరాభవం…. అర్హులుకి కాకుండా వైసిపి సానుభూతిపరుల ఇళ్ళు కేటాయించారని కారు దిగకుండా ముట్టడించిన గ్రామస్తులు…. భయపడి పోలీస్ జీప్ లో దాక్కున్న ఎమ్మెల్యే…….???????????????????????????????????? pic.twitter.com/YYb65KPwKE
— #Bose DK WhoKilledBabai (@micky_4645) July 4, 2021
ఈ ఘటన జరిగిన వారం రోజులు కూడా కాకుండానే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేను రైతులు పబ్లిక్‌గానే నిలదీశారు. అవాక్కైన ఎమ్మెల్యే రైతులపై ఎదురుదాడికి దిగారు.
రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో ఓ రైతు తన ధాన్యం అమ్మి మూడు నెలలు అవుతున్నా… ఇప్పటికీ డబ్బులు రాలేదని కారుమూరిని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయి.. నువ్వు కూర్చో అంటూ అసహనం వ్యక్తం చేశారు. నువ్వేమైనా పోటుగాడివా ? అని రైతును దూషించడంతో రైతులు అంతా విస్తుపోయారు.
ఆరుగాలం తాము ఎంతో కష్టపడి పంటలు పండిస్తే.. డబ్బులు ఇవ్వకుండా.. రైతుపైనే ఎదురు దాడి ? చేస్తారా ? అని కారుమూరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రాంతంతో సంబంధం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిస్తోన్న పరిస్థితే ఉంది.
రైతు దినోత్సవం రోజున సన్మానించాల్సిన రైతును అవమానించడం చాలా బాధాకరం. ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు అహంకార వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను.#AntiFarmerPartyYSRCP pic.twitter.com/V8VRAKTLA1
— N Amarnath Reddy (@NAmaranathReddy) July 8, 2021