వైసీపీ అబద్ధాన్ని బయటపెట్టేసిన RRR

జగన్ కు ప్రతిపక్షం ఏదైనా ఉందంటే... అది రఘురామరాజు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎంత విషయం ఉన్నా... తన వాగ్దాటి వెటకారంతో టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీ అబద్ధాలను చీల్చిచెండాడుతున్నారు రఘురామరాజు.

పాపం ఎంతో ఆలోచించి... ఒక ఐడియా తయారుచేసుకుని పార్టీ అంతా కలిసి ఒక విషయాన్ని వైసీపీ రంగు పూసి జనం చేత నమ్మిద్దామనుకుని నానా పాట్లు పడితే... సింపుల్గా చెట్టుకింద కూసుని ఆ ఐడియా వెనుక కుట్రను, అబద్ధాలను విప్పి జనం ముందు వైసీపీ పరువు తీస్తున్నాడు రఘురామరాజు.

ఎన్నికల కమిషనర్ ని డ్యామేజ్ చేయాలని వైసీపీ చేసిన అనేక విఫలయత్నాల తర్వాత కూడా ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ కీలక నేత శ్రీకాంత్ రెడ్డి అలాంటి ఒక బురద జల్లే కార్యక్రమం పెట్టుకుని ... నిమ్మగడ్డను, రమేష్ కుమార్ ను ఇరికించే ప్రయత్నం చేయబోతే దాన్ని రఘురామరాజు చాలా సింపుల్ గా చేధించి జనాలకు నిజం విపులీకరించి చెప్పారు. దీంతో వైసీపీ పరువు పోయింది.

ఆ వీడియో మీ కళ్లతో మీరు చూస్తే ఆ మజాయే వేరు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.