జగన్ పై ఆయన సోదరి దివంగత నేత వైయస్ వివేక కూతురు సునీత రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. అంతఃకరణశుద్ధి అంటే ఏమిటో మీకు తెలుసా? అని జగన్ ను ప్రశ్నించారు. వివేకా దూరమై ఐదేళ్లు గడుస్తున్నా హంతకులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో జరిగిన వివేకా సంస్మరణ సభలో భావోద్వేగానికి గురై ఈ వ్యాఖ్యలు చేశారు.
వివేకా జీవితాంతం వైఎస్సార్ కోసమే పని చేశారని, ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే ఆయన…. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని అనునిత్యం పరితపించే వారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేశారని, జగన్ సీఎం అయిన తర్వాత కూడా హంతకులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు.
అంతేకాకుండా, ఆ నేరాన్ని తాము చేశామని చెప్పేందుకు మీకు ఎబ్బెట్టుగా లేదా? అని నిలదీశారు. ప్రభుత్వంలో ఉండి తమపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వివేకా హంతకులను పట్టిస్తే రూ. 5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటన చేసిందని, తమను పట్టించి ఆ బహుమతిని అందుకోవాలని చురకలాంటించారు.
సాక్షి పత్రికలో తమపై నిందలు వేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారని, . ఆ ఆరోపణలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తామ నేరం చేసినట్లు ఆధారాలు ఉంటే సిబిఐ అధికారులకు ఇవ్వాలని సాక్షి ఛైర్ పర్సన్ భారతికి విన్నవించారు. వివేకా రక్తం, కోడికత్తి రక్తం వైసీపీ పునాదుల్లో ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు రావాలని సంచలన పిలుపునిచ్చారు. వైసీపీ నుంచి బయటకు రాకపోతే ఆ పాపం వారిని చుట్టుకుంటుందని హెచ్చరించారు.