ఓదార్పు యాత్రల్లో వైఎస్ ఫ్యామిలీ పీహెచ్ డీ చేసినట్టుంది. సరిగ్గా గురిచూసి ఓదార్చుతారు.
అయితే, వీరి గేమ్ లు అర్థం చేసుకోకుండా ఉండటానికి చంద్రబాబు కాదుగా… కేసీఆర్. అంతకు మించి వ్యూహాలు రచించే సిసలైన రాజకీయ నాయకుడు. అందుకే కేసీఆర్ కు షాకిద్దాం అనుకున్న షర్మిలకే షాక్ తగిలింది.
ఉద్యోగం లేదని ఆత్మహత్యం ప్రయత్నం సాయి అనే యువకుడిని కలవడానికి షర్మిల ప్రయత్నం చేశారు. సూర్యాపేట జిల్లాలో నెరేడుచర్ల మండలంలోని మేడారంలో ఉంటుంది ఆ యువకుడి కుటుంబం.
వారిని ఓదార్చడం ద్వారా కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని చెప్పడం షర్మిల ఉద్దేశం. అయితే… వారింటికి చేరుకున్న షర్మిలకు భారీ షాక్ తగిలింది. ఆమె అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఇంటికి లాక్ వేసి ఉంది.
సాయి కుటుంబం అక్కడ లేదు. దీనికి కారణం కేసీఆరే అని షర్మిల విమర్శలు చేసింది. అధికార పార్టీ నాయకులు, పోలీసులు సాయిపై ఒత్తిడి తెచ్చారని అందుకే వారు ఇంటిని వదిలిపెట్టారని షర్మిల ఆరోపించారు.
కానీ ఎపుడు ఏం చేయాలో, వీరి ఆటలు ఎలా కట్టించాలో కేసీఆర్ బానే పసిగట్టాడు.