గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరియు ఆయన అనుచరుల ఆగడాలకు గన్నవరం నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వల్లభనేని వంశీ.. 2019 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే ప్లేట్ ఫిరాయించి వైసీపీలోకి జంప్ అయ్యారు. జగన్ ప్రోత్సాహంతో నిత్యం చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వంశీ రెచ్చిపోయారు. అందుకు మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నారు.
దాదాపు 100 రోజులు నుంచి వంశీ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13న అరెస్ట్ అయిన వంశీ పై.. ఆ తర్వాత వరుసగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ తెచ్చుకునేలోపే.. మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు అవుతుంది. ఇప్పటికే ఐదు ఐదు కేసులు వంశీకి బెయిల్ లభించింది. రేపో మాపో రిలీజ్ అవుతారు అనుకునే లోపే నకిలీ ఇళ్ల పత్రాల కేసులో వంశీకి రిమాండ్ పడింది. దాంతో వందరోజుల నుంచి జైల్‌లోనే మగ్గిపోతున్న వంశీ అనారోగ్యానికి కూడా అయ్యారు. ఆయన పరిస్థితి చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు వంశీకి వైసీపీ అధిష్టానం నుంచి న్యాయపరంగా ఆశించిన స్థాయిలో మద్దతు మాత్రం లభించడం లేదు. ఈ విషయంపై ఇప్పటికే ఆవేదనతో ఉన్న వంశీకి.. జగన్ మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా గన్నవరం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బాధ్యతను దుట్టా రామచంద్ర రావు కుమార్తెకు అప్పగించే ఆలోచనలు జగన్ ఉన్నారంటూ ఫ్యాన్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
అయితే కనీసం ఒక్క మాట అయినా చెప్పకుండా నియోజకవర్గ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలనే నిర్ణయాన్ని జగన్ తీసుకోవడం వంశీని మరింత మనస్థాపానికి గురి చేస్తున్నట్లు సమాచారం. జగన్ కోసం, పార్టీ కోసం ఎంతో చేసిన ఈ విధంగా పక్కన పెట్టేయడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.