వైసీపీ అభిమానులకు సీక్రెట్ నోటీస్ వచ్చిందా !

తెలంగాణలోని వైసీపీ అభిమానులకు పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నుంచి సీక్రెట్ మెసేజ్ వచ్చిందని సమాచారం తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం అందరికీ ఆయా జిల్లాల పార్టీ గ్రూపులు, ఫేస్ బుక్ సీక్రెట్ గ్రూపుల ద్వారా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థులకే పడాలని పార్టీ అధిష్టానం నుంచి సందేశాలు పంపారట. ఇందులో రహస్యం ఏముంది, వాళ్లిద్దరు ఫ్రెండ్సే కదా అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడే మతలబు ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు నడుస్తున్నాయి. ఏపీ నీటి హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నాడు. జల వివాదాలపై కేసీఆర్ పై చేయి సాధించాడు. దానిని అడ్డుకోవడంలో జగన్ సర్కారు విఫలం అయ్యింది. మరోవైపు ఇటీవలే కేసీఆర్ ఆంధ్రాను తొక్కేశాం అని కామెంట్లు చేసినా జగన్ ఏమీ అనలేదు. తిట్టినా సైలెంటుగా ఉన్నాడు. దీనిపై ఆంధ్రులు మండిపోయారు. ఈ క్రమంలో బహిరంగంగా కేసీఆర్ పార్టీకి ఓటేయమని చెబితే సోషల్ మీడియా సాక్ష్యాలతో అది ట్రోల్ అయిపోతుందని... కేసీఆర్ చెప్పినట్లు జగన్ వింటున్నారనే విషయం తెలిసిపోతుందని సీక్రెట్ సందేశాలు పంపినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంతేకాదు మరో ప్రధాన కారణం కూడా ఉంది. బీజేపీతో తో తలపడుతున్న టీఆర్ఎస్ కు బహిరంగ మద్దతు ఇస్తే మోడీ షాలకు జగన్ పై కోపం వస్తుంది. ఆ కోపం జగన్ కి చాలా నష్టం. అందుకే రహస్య సందేశం పంపాల్సి వచ్చిందట.  ఏపీలో కేసుల వల్ల బీజేపీతో  వైసీపీ సానుకూలంగా ఉంది. మోదీ షాలంటే జగన్ కి భయమే గాని భక్తి లేదు. అయితే, ఈ విషయం వైసీపీ అభిమానులకు క్లారిటీ లేదు. ఏపీలో బీజేపీతోను, తెలంగాణలో టీఆర్ఎస్ తోను స్నేహం చేస్తున్న జగన్ ముందుకు నడుస్తున్నారు. క్లారిటీ ఇవ్వకపోతే తన అభిమానుల ఓట్లు చీలి  బీజేపీకి కొందరు, టీఆర్ఎస్ కి కొందరు ఓటు వేసే అవకాశం ఉంది. ఒక్క వైసీపీ ఓటు కూడా బీజేపీకి పోకూడదు అన్న కృతనిశ్చయంతో జగన్ తన అభిమానులకు సీక్రెట్ సందేశం పంపారట.

మొత్తానికి జగన్ బీజేపీతో కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారన్నమాట.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.