అవును! వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైపోయారు? ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకవైపు.. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రం అల్లాడిపోతోంది. మరోవైపు తుఫాను ప్రభావ వర్షాలతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎక్కడా కూడా.. వారిని ఆదుకునే యంత్రాంగం పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. వారి సమస్యలు వినే నాధుడు కూడా కనిపించడం లేదు. సీఎం జగన్ కేవలం.. అధికారులకు మాత్రమే సూచనలు చేసి వదిలేశారు. దీంతో అధికారులు కూడా షెడ్యూల్ ప్రకారం పనిచేస్తు న్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి సమయంలో ప్రజలకు మేమున్నామంటూ.. వైసీపీ నాయకులు ముందుకు రావాల్సి ఉంది. అయితే.. ఎక్కడా ఎవరూ ముందుకు రావడం లేదు. తూర్పుగోదావరిలో మంత్రి చెల్లుబోయిన వేణు ఉదయం సాయంత్రం వేళ్లలో విజిట్ చేసి.. రైతుల సమ స్యలు తెలుసుకుంటున్నారే తప్ప.. మిగిలిన మంత్రులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అధికారిక యంత్రాంగం మాత్రమే కనిపిస్తున్నారు. అది కూడా.. పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోవడం గమనార్హం. నిజానికి నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకులు ప్రజల కోసం వారి ఇళ్ల చుట్టూ తిరిగారు.
సాధికార బస్సు యాత్రలు అన్నారు. గడపగడపకు యాత్రలు అన్నారు.. కానీ, ఇప్పుడు ఎక్కడా అజ లేకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా.. పలు జిల్లాల్లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ.. ముందుకు రాకపోగా.. కనీసం పోన్లకు కూడా స్పందించడం లేదని.. జనాలు మండిపడుతున్నారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుతో క్షేత్రస్థాయిలో యంత్రాంగం ముందుకు కదిలారు.
మాజీ మంత్రి కేఎస్ జవహర్.. రాజమండ్రిలో పర్యటించారు. ఎమ్మెల్యేలు.. ఏలూరి సాంబశివరావు, నిమ్మల రామానాయుడు వంటివారు వర్షం తడుస్తూనే ప్రజల క్షేమాలను కనుక్కుంటున్నారు. అక్కడికక్కడే సాయం అందిస్తున్నారు. బోట్లు ఏర్పాటు చేసి.. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. రేపు ఎందుకుఓటు వేయాలని.. వైసీపీ నాయకులను ప్రశ్నిస్తుండడం గమనార్హం.