సీఎం జగన్ పాలనలో సామాన్య ప్రజలు మొదలు ప్రతిపక్ష నేతల వరకు అందరిపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయిత, ఆ దాడులు తాజాగా పోలింగ్ రోజు కూడా కొనసాగాయి. ఈ సారి ఓ సామాన్యుడిపై వైసీపీ నేత, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ దాడికి తెగబడ్డారు. పోలింగ్ కేంద్రంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని శివ కుమార్ చెంప దెబ్బ కొట్టారు. అయితే, ఆ వ్యక్తి కూడా అస్సలు తగ్గేదేలే అన్న రీతిలో శివకుమార్ చెంప ఛెళ్లుమనిపించడంతో ఎమ్మెల్యేకు షాక్ తగిలింది.
ఆ తర్వాత ఆ వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడి చేశారు. క్యూలో వెళ్లాలని శివ కుమార్ కు సూచించడమే ఆ ఓటరు చేసిన తప్పు. తననే అడ్డుకుంటాడా అని కోపంతో మండిపడ్డ శివకుమార్ … ఆ ఓటరు చెంప చెళ్లుమనిపించడం, వెంటనే అదే స్పీడ్ తో శివకుమార్ ను ఆ ఓటర్ తిగిరి కొట్టడం…ఈ ఘటనల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు జిల్లా తెనాలిలోని పోలింగ్ బూత్ లో జరిగిన ఈ ఘటన వీడియో వైసీపీకి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చిన శివ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది.
ఓటింగ్ రోజే ప్రజలు ఇలా తిరగబడుతుంటే, జూన్ 4 తరువాత నీ పరిస్థితి ఏంటి జగన్ ? ఇక లండన్ పారిపో.. మళ్ళీ ఏపీ వైపు తిరిగి చూడకు… ???? #YSRCPRowdyism #EndOfYCP #AndhraPradeshElections2024 pic.twitter.com/OJHjFK6POi
— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024