గతవారం రోజులుగా విజయవాడ ను చుట్టుముట్టిన వరద.. 8 రోజుల తర్వాత.. అంతో ఇంతో తగ్గుముఖం పట్టింది. బాధిత ప్రాంతాల్లోని ప్రజలు కోలుకుంటున్నారు. వారికి అందాల్సిన సాయం కూడా అందుతోం ది. అయితే. అసలు సిసలు రాజకీయ వరద ఇప్పుడు వైసీపీని కుమ్మేస్తోంది. మూడు ప్రదాన అంశాలు.. వైసీపీని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. వీటిలో ప్రధానంగా వరద సమయంలోనూ జగన్ రాజకీయం చేయడం. రెండు.. వైసీపీ నాయకులు కనిపించకపోవడం.. మూడు.. ప్రకాశం బ్యారేజీనే ఢీ కొట్టే ప్రయత్నం చేయడం.
ఆయా అంశాలపై టీడీపీ నాయకులు, మంత్రులు వరుస పెట్టి వైసీపీని వాయించేస్తున్నారు. ఈ వరద బురద కడుక్కునేందుకు వైసీపీ గుంజాటన పడుతోంది. రెండు సార్లు ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన జగన్.. బాధితులకు అండగా ఉంటానని మాత్రం చెప్పలేదు. ఇదంతా చంద్రబాబు సర్కారు చలవేనని చెప్పారు. పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తర్వాత సోషల్ మీడియాలోనూ ఇదే తరహా వాదన వినిపించారు. దీనికి టీడీపీ నుంచి ఘాటు సమాధానం వచ్చింది.
ఇక, విజయవాడ నగర కార్పొరేషన్ ఇంకా వైసీపీ హయాంలోనే ఉంది. అయితే.. మేయర్ సహా కార్పొరేటర్లు ఎవరూ కూడా.. ప్రజలను పట్టించుకోవడం లేదన్న వాదన తెరమీదికి వచ్చింది. దీనిని కార్నర్ చేస్తూ.. టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మేయర్ ఏం చేస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీంతో విధిలేని పరిస్థితి మేయర్ అయిష్టంగానే వరద నీటిలో పర్యటించాల్సి వచ్చింది.
ఇక, ప్రకాశం బ్యారేజీని 67వ నెంబరు గేట్ దగ్గర ఐరన్ బోట్లతో గుద్దించే ప్రయత్నం చేయడం.. అక్కడి పిల్లర్లకు కూడా డ్యామేజీ జరగడంతో సర్కారు సీరియస్ అయింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోం ది. అయితే.. ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడికి చెందినవని పోలీసులు గుర్తించా రు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ ఘటన వెనుక వైసీపీ నాయకులు ఉన్నారంటూ.. టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో వాదన వినిపిస్తున్నారు. దీనికి కౌంటర్లు ఇవ్వలేక .. వైసీపీ మౌనంగా ఉండిపోయింది. మొత్తానికి విజయవాడ వరద తగ్గినా.. వైసీపీని చుట్టుముట్టిన వరద ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.