బాబును ఓడించడానికి వైసీపీ చెప్పిన అబద్ధాల లిస్ట్ తెలుసా?

చంద్రబాబు నచ్చని వాళ్లు ఏపీలో బొచ్చెడు మంది నాయకులు ఉన్నారు. కానీ చంద్రబాబుకు పాలన రాదు అని కాని, చంద్రబాబు ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు అనే వాళ్లు కూడా వెతికితే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.

అయితే, న్యూస్ ఛానెళ్లలో చర్చలకు హాజరయ్యే వారిలో అత్యధికులకు చంద్రబాబు దొరకడు... ఇంకో వైపు అడక్కుండా జగనన్న... వారిని  అన్నా అంటూ భుజం మీద చెయ్యేసి బుగ్గ నిమిరి కడుపులో ప్రేమగా ఒక గుద్దు గుద్దుతాడు.

ఇక అంతే... ఆ రోజు నుంచి ఉబ్బితబ్బిబ్బయై ఆ మాయలో వైసీపీ అల్లిన అబద్ధాలను టీవీ టీవీకి తిరిగి ప్రచారం చేసిన పలువురిని చంద్రబాబు గాని, ఆయన తనయుడు గాని లెక్క కూడా చేయలేదు. దాని ఫలితమే ఆ అబద్ధాలు కాస్త జనం మెదళ్లలో బలంగా నాటుకుపోయి బాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి. అలాంటి   వైసీపీ ఆడిన కీలక అబద్ధాల్లో మచ్చుకు కొన్ని ఒక నెటిజన్ మాకు పంపాడు.

◆ లేని శ్రీవారి పింక్ డైమండ్ CBN దొంగతనం చేశాడు

◆ శ్రీవారి ఆభరణాలు పోటు తవ్వి కాజేశాడు..

◆ పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ   వెయ్యాలి.

◆ బాబాయి మర్డర్ లో CBN హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.

◆ కోడి కత్తి గీకుడు CBN చేయించాడు సిబిఐ వెయ్యాలి..

◆ CBN ప్రభుత్వంలో ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది (అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)

◆ CBN చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది CBN ప్రభుత్వం చేసిన అప్పు 1,00,600 కోట్లు.. గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్)

◆ శేఖర్ రెడ్డి CBN బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) ◆పట్టిసీమలో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్ టెండర్ ఇచ్చారు)

◆ సీబీఎన్ 6 లక్షల కోట్లు అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 15 నెలల్లో)

◆ అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు..

◆ అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన)..

◆ సెంటర్ కి UC లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)

◆ డీఎస్పీ ప్రొమోషన్ లలో 36 మందిలో 34 మంది కమ్మ వారికె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)

◆ ఎన్నికల ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)

ఇదీ కథ. ఇలా ఉంటుంది... వైసీపీ వ్యవహారం. అంతేకాదు, సీపీఎస్ రద్దు మొదలుకుని ఎన్నో అబద్ధపు హామీలు కూడా ఇచ్చిన మహానుభావుల పార్టీ వైకాపా. అవన్నీ నమ్మిన వారు... ఇపుడు విమర్శిస్తే జగన్ అభిమానులు ఎక్కడ బూతులతో దాడిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించి చావును చూపిస్తారో అని కడుపు నిండా మంట ఉన్నా కూడా ఎన్నికల కోసం వేచి చూస్తూ ఉన్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.