ఇటీవల కాలంలో వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్‌ను తాము అభిమానిస్తున్నామని.. కానీ, ఆయన కూడా తమను అభిమానించాలి కదా! అంటూ.. ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, తనతో అందరూ కలిసి పనిచేస్తానంటేనే.. తాను వచ్చే ఎన్నిక ల్లో పోటీకి దిగుతానని కూడా సంచలన కామెంట్లు చేశారు. అంటే.. ఇప్పుడు ఆయన ఒంటరయ్యారనే వాదన స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయన పుట్టిన రోజు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో భారీ కార్యక్రమం నిర్వహించి.. బల ప్రదర్శన చేశారు. ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలను కార్లు పెట్టి మరీ తర లించారని చెబుతున్నారు. అంటే.. ఈ సందర్భంగా ఆయన తన బలాన్ని నిరూపించుకున్నట్టు అయిం ది. అయితే.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే.. పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే!.
అయితే.. రేపు వైసీపీ అధిష్టానం.. ముఖ్యంగా సీఎం జగన్ వీటికి కూడా లొంగకుండా ఉంటే.. పరిస్థితి ఏంటి? అనేది చర్చగా మారింది. వైసీపీకి బాలినేని దూరం కావడం తప్ప.. ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే ఆయన సెక్యూరిటీని తిరిగి ఇచ్చినా.. జిల్లాల ఇంచార్జ్‌గా రాజీనామా చేసినా.. పార్టీలో ఎలాంటి చలనం కనిపించలేదు. అంటే.. వ్యక్తి కంటే పార్టీనే ప్రధానమని అధిష్టానం తేల్చేసింది.
వచ్చే ఎన్నికల నాటికి ఈ ఇగో ప్రాబ్లం మరింత పెరిగి.. బాలినేనికి సెగ ముదిరితే తర్వాత ఆల్టర్నేట్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చేస్తే.. టీడీపీలోకి వచ్చేందుకు బాలినేనికి ఛాన్స్ లేదు. ఇక, జనసేనలోకి వెళ్లే అవకాశం కూడా లేదు. వెళ్తే మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్లాలి. ఇంత సాహసం బాలినేని చేసే అవకాశం లేదు. సో.. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీ తప్ప మరోమార్గం కనిపించలేదు. అందుకే.. ఆయనైనా తగ్గాలి.. లేదా అధిష్టానమైనా.. ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వాలి. లేకపోతే సొంత పార్టీలోనే సెగ తప్పదని అంటున్నారు పరిశీలకులు.