కేసీఆర్ కు దక్కాల్సిన ఓటింగ్ ను చీల్చే ఇష్టం లేకనో ఏమో గాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జగన్ మేము మిత్రులం అని కేసీఆర్, ఆయనకుమారుడు కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరి స్నేహం కోసం జగన్ రెడ్డికి చెందిన వైసీపీ పార్టీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని, అంతవరకు గ్యాప్ కావాలని పార్టీ పేర్కొంది.
ఇక కులం అంటే ఏవిటో తెలియని వైసీపీ గురించి ఒక చిక్కటి చక్కటి నిజం జీహెచ్ఎంసీ ఎన్నికల పుణ్యమా అని బయటకు వచ్చింది.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్ రెడ్డి.
ఆ పార్టీ మూడు ప్రాంతాల అధ్యక్షులు … వి.సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి
ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి.
మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి.
అంటే వైసీపీ పార్టీ కీలక పదవులు ఇతర కులాలకు దక్కవు దక్కనివ్వరు.
అదే తెలుగుదేశం పార్టీలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.
తెలుగు దేశం ఇరు రాష్ట్రాల అధ్యక్షులు బీసీలు
ఒకరు అచ్చెన్నాయుడు, మరొకరు ఎల్.రమణ.
అన్ని కులాలకు కీలక పదవులు ఇచ్చే తెలుగుదేశం కులపార్టీ అట, రెడ్లను మాత్రమే అధ్యక్షులను చేసే వైసీపీ కులసామరస్య పార్టీ అట… వింటే వైసీపీ మాటలే వినాలి, తాగితే ప్రెసిడెంట్ మెడలే తాగాలన్నమాట.