ఈ టెక్ జమానాలో నగరాలలోని చాలామంది చేతిలో స్మార్ట్ ఫోన్..ఇంటికో ఇంటర్నెట్ కామన్ అయిపోయింది. ప్రపంచాన్ని ఓ కుగ్రామంలో చేసిన ఇంటర్నెట్ అందిస్తున్న సదుపాయలను ఉపయోగించుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంటర్నెట్ వాడుతున్న చాలామంది తమకు తెలియని…తమకు కావాల్సిన సమాచారం కోసం గూగుల్ మీద ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే అత్యధిక మంది గూగుల్ లో ఏం వెతుకుతున్నారనే విషయం తెలుసుకోవడం కోసం గూగుల్ ఓ సర్వే నిర్వహిస్తుంటింది.
ఆ క్రమంలోనే ఈసారి కూడా న్యూజిలాండ్ లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ ఫ్లిక్ట్ స్టడీస్ ఆ విషయంపై అధ్యయనం నిర్వహించింది. భార్యలపై పైచేయి సాధించడం ఎలా అన్న ప్రశ్నను చాలామంది మగాళ్లు గూగుల్ తల్లిని అడిగి తెలుసకున్నారట. ఇక, ఆడవాళ్లు అత్యధికంగా గూగుల్ లో ఏం వెతికారో తెలిస్తే అవాక్కవ్వక మానరు. చాలామంది మహఇళలు గోరింటాకు డిజైన్లు, మెహెందీ మోడల్స్, రొమాంటిక్ పాటలు, రొమాంటిక్ కవితల గురించి వెతుకుతున్నారని ఆ సర్వేలో తేలింది.
ఇక, అమ్మాయిలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బ్యూటీ టిప్స్ గురించి కూడా బాగానే సెర్చ్ చేశారని తేలింది. కొత్త డిజైన్లతో కూడిన డ్రెస్ లు, ట్రెండీ డిజైన్స్, కొత్త కలెక్షన్స్ వంటి విషయాలపై అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేశారట. మనదేశంలో ఇంటర్నెట్ ను వినియోగించే వారు సుమారుగా 15 కోట్ల దాకా ఉంటే..అందులో మహిళలు 6 కోట్లు ఉంటారట. మహిళలే ఇంటర్నెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఆ 6కోట్ల మంది మహిళల్లో 15 నుంచి 34 ఏళ్ల మధ్యనున్న వాళ్లు తమ జీవనశైలిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనే అంశంపై ఎక్కువ ఆసక్తి కనబరిచారట.