అనంతపురం- అమ్మాయిని తగలబెట్టి చంపేశారు

ముఖ్యమంత్రి మాటలు చూస్తే దేశంలో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అన్నట్టుంటుంది. కానీ సినిమాల్లో కూడా చూపించనంత దారుణంగా ఏపీలో అమ్మాయిలను తగలబెట్టేస్తున్నారు. ఒక్క దిశ ఘటనకే నిందితులను పిట్టలను కాల్చినట్టు కాల్చారు తెలంగాణ పోలీసులు.

కానీ ఏపీలో వరుస అత్యాచారాలు, సజీవ దహనాలు జరుగుతున్నా కనీసం నిందితులను పట్టుకోవడంలో కూడా ఏపీ పోలీసులు విఫలం అవుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నేత ఓబుల్ రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతాల్లో ఆడపిల్ల కనబడితే రేప్ చేసి చంపేసేవాడు.

అతని ఆగడాలను అరికట్టడానికే పరిటాల రవి ఉదయించాుడ. ఓబుల్ రెడ్డిని హత్య చేసి పరిటాల రవి అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి కష్టాలు పోగొట్టారు. మళ్లా అట్టాంటి నేస్థులు ఏపీలో కనపించలేదు. ఇక కనిపించరమేమో అనుకుని భ్రమపడ్డాం. కానీ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిందితులు రెచ్చిపోతున్నారు. వీరికి ఎవరి సహకారం ఉందో, ఎవరి ధైర్యం ఉందో తెలియదు గాని ఆడపిల్లలను నిర్దాక్షిణ్యంగా చెరుస్తున్నారు. ఏకంగా తగలబెడుతున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఇవే ఘటనలు.

మొన్న ప్రకాశం జిల్లాలో వికలాంగ వలంటీరును తగలబెట్టి చంపేశారు. నేడు ఎస్బీఐ కాంట్రాక్టు ఉద్యోగినిని తగలబెట్టి చంపేశారు. అనంతపురం జిల్లా బడన్నపల్లి వద్ద ధర్మవరం SBIలో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలతను దారుణంగా పెట్రోలు పోసి తగలబెట్టి చంపేశారు. రోజూ ధర్మవరానికి ద్విచక్రవాహనంపై వెళ్లివస్తున్న స్నేహలత స్నేహలత కనిపించడం లేదని నిన్న పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆమె శవమై తేలారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.