ప్రజారవాణా బస్సు లను ఎక్కేప్పుడు ఎంతో సంప్రదాయంగా ఉండడం సహజం. మహిళలైనా, పురుషులై నా.. కొంత సంప్రదాయం పాటిస్తారు. మరీ ఇంట్లో ప్రైవేట్ గా ఉండే సమయంలో వేసుకును దుస్తులు అయితే వేసుకోరు కదా! కానీ, ఓ మహిళ.. హద్దులు చెరిపేసి.. దస్తులు స్వేచ్ఛకు చిహ్నాలు అన్నట్టుగా వ్యవహరించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ఎక్కింది. అయితే.. ఆమె కేవలం బికినీనే ధరించి ఉండడం గమనార్హం.
కనీసం ఆచ్ఛాదనగా.. మరో వస్త్రాన్ని కూడా కప్పుకోలేదు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. ఇదేంటి అని బుగ్గలు నొక్కుకున్నారు. ఇక, కండెక్టర్ కూడా ఆమె అవతారం చూసి.. దూరంగానే ఉండిపోయారు. అయితే.. కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని వీడియోలు తీసి.. ట్విట్టర్లో షేర్ చేశారు. అంతే.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రచారం అయిపోయింది. ప్రధాన మీడియాల్లోనూ ఇది ప్రసారం అయ్యేసరికి.. అందరూ షాక్‌కు గురయ్యారు.
ఇక, ఈ ఉదంతపై నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. మహిళా స్వేచ్ఛకు పరాకాష్ట .. అని ఒకరు అంటే.. వారి దుస్తులు వారి ఇష్టం బ్రో! అని కొందరు అన్నారు. పబ్లిక్‌లో ఇలా చేయడం తగదని మరికొందరు చెప్పారు. అయితే.. చిత్రం ఏంటంటే.. క్షణాల్లోనే ఈ వీడియోలకు.. సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఇక, దీనిపై ఢిల్లీ రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు ఏమీ స్పందించలేదు. మరి వారే మంటారో చూడాలి.
दिल्ली की बसों की व्यवस्था पूरी तरह से बदहाल हो चुकी हैं ।
दिल्ली मैट्रो से ज्यादा असुरक्षित हैं दिल्ली की बसें ।
यह तो एक छोटी सी घटना हैं हर रोज़ सैकड़ो लोगों की बसों में जेब कट रही हैं उसका जिम्मेदार कोन हैं….?#delhi #DelhiMetro #bus #DTC #CLUSTER #aap #BJP@kgahlot pic.twitter.com/FzEe26UuCe— Delhi Buses (@DELHIBUSES1) April 17, 2024