చిత్రంగా అనిపించినా ఇది నిజం! ఆ దంపతులకు పెళ్లయి పదకొండు సంవత్సరాలు అయింది. అయితే.. ఏటా ఒక్కొక్కరు చొప్పున ఆ ఇల్లాలు పిల్లలను కంటూనే ఉంది. తాజాగా 11వ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. సాధారణంగా.. పెళ్లియిన తర్వాత ఒకరిద్దరు పిల్లలతో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. లేకపోతే.. మగ బిడ్డ కోసం.. కొననాళ్లు కష్టపడతారు. కానీ.. ఇక్కడ ఆ సమస్య లేదు. రెండో కాన్పులోనే మగ పిల్లాడు పుట్టేశాడు. కానీ, ఆ దంపతులకు పిల్లలను కనడం ప్యాషన్ అయిపోయిందట.
దీంతో వరుస పెట్టి పెళ్లయిన నాటి నుంచి నేటి వరకు పిల్లలను కంటూనే ఉన్నారు. వారేమీ.. అమాంబాప తు ఫ్యామిలీకి చెందిన వారు కాదు. ప్రజలతో జై కొట్టించుకునే కుటుంబానికి చెందిన వారే. వారే.. అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజ ఇన్ఫ్లుయెన్సర్.. కరిస్సా కాలిన్స్, మాండ్రే దంపతులు. వీరికి 2009లో ప్రేమ చిగురించింది. ఆ తర్వాత.. రెండేళ్లకు పెళ్లి చేసుకున్నారు. ఇక, అప్పటి నుంచి కరిస్సా పిల్లలను కంటూనే ఉంది. ఎలాంటిఆరోగ్య సమస్యలు కూడా రాకపోవడం గమనార్హం.
పైగా.. చేతినిండా ఆదాయం కూడా నట! అదేంటి అనుకుంటున్నారా? పుట్టిన పిల్లలతో ఆమె వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో సందేశాలు కూడా పెడుతున్నారు. దీంతో ఫాలోవర్లు పెరిగి. తద్వారా ఆదాయం కూడా పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటికి 10 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయిలట. ఇటీవల తాజాగా 11వ పిల్లాడికి ఈ దంపతులు జన్మనిచ్చారు. మరి ఇప్పటితో అయినా.. ఆపేస్తారా? అని సందేహం రావొచ్చు. దీనికి కరిస్సా చెప్పిన సమాధానం.. ఇదీ..
“నాకు బోలెడంతమంది పిల్లల్ని కనాలని ఉంది. ఇప్పుడు కనింది.. ఆ సంఖ్యలో స్వల్పమే. మన దేశంలో పిల్లల్ని కనడం ఆపేయండి అనే నిబంధన తెచ్చేవరకు కంటూనే ఉంటా!“ అని చెప్పారు కరిస్సా!! ఇదీ.. సంగతి!