మనదేశ రాజకీయ రంగంలో సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించబోయే అభివృద్ధికి ఏనాడో బీజాలు వేసిన రాజకీయ మేధావి చంద్రబాబు. 1956 నుండి 2021 వరకు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఏపీపై, నవ్యాంధ్రపై చెరగని ముద్ర వేసిన మార్గదర్శి.
యువకుడి నుంచి ఏడు పదుల వయసు వరకు ప్రజా సంక్షేమంకోసం, రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు చేసిన కృషిని, సేవలు వెలకట్టలేనివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పరిపాలనలో,విభజిత నవ్యాంధ్రలో 5 ఏళ్ల పాలనలోగానీ చంద్రబాబు తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. భారతదేశ చిత్రపటంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత చంద్రబాబుదే.
అయితే, 2019లో ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలనా తీరును నిశితంగా పరిశీలించినవారికి రాష్ట్ర భవిష్యత్ అగమ్యగోచరం అని అర్థమవుతుంది. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్…రాష్ట్ర ప్రజలు, వారి పిల్లల భవిష్యత్తును గాడాంధకారం చేశారనడంలో సందేహం లేదు. సంక్లిష్ట పరిస్థితులు, కరోనా వంటి సంక్షోభాలను సవాళ్లుగా స్వీకరించగల చంద్రబాబు…ఇపుడున్న పరిస్థితుల్లో సీఎంగా ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదనడంలో ఎటువంటి సందేహం లేదు.
అందుకే, కనీసం ఇప్పుడైనా సగటు ఆంధ్రుడు, తెలుగువారు మేలుకొని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మళ్ల ీముఖ్యమంత్రిని చేసుకోకపోతే ఏపీ ప్రజలు, వారి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరం అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ఏంటి, ఆయన పరిపాలనా దక్షత ఏంటి…ఇపుడు ఏపీకి ఆయన అవసరం ఏంటి అన్న విషయాలపై రూపొందించిన ఒక పోస్ట్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ పోస్ట్ సారాంశం ఇదే….
‘‘నువ్వు తెలుగు వాడివైతే, అందునా ఆంధ్రుడివైతే.. ఇది తప్పకుండా నీ భవిష్యత్తు. మీది కాకపోతే మీ పిల్లల, భావితరాల భవిష్యత్తు.
చదువుతుండగానే రొటీన్ గా వినే మాట అన్నట్లు మీకనిపించవచ్చు. కానీ..ఒక వ్యక్తి ఆత్మస్థైర్యానికి, గుండె నిబ్బరానికీ, అచంచలమైన ఆత్మవిశ్వాసానికీ ఇది ప్రత్యక్ష సాక్ష్యం.
ఆయన హైదరాబాద్ ని అభివృద్ధి చేసాను అంటే నవ్వాం.
ఆయన సైబరాబాద్ ని సృష్టించానంటే నవ్వాం.
ఆయన టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పుల కోసం కృషి చేసాను అంటే నవ్వాం.
ఆయన అబ్ధుల్ కలాం పేరుని దేశ ప్రధమ పౌరుడికై సూచించాను అంటే నవ్వాం.
ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా వీధుల్లో ఫైల్స్ చేతిలో పట్టుకొని ఐటీ కంపెనీల కోసం తిరిగాడు అంటే నమ్మలేదు.
ఆయన వేసిన ఐటీ, బయోటెక్నాలజీ బీజాలు మొక్కలై, వట వృక్షాలై లక్షలాది మంది తెలుగు వారికి ఉపాధి, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తుంటే.. అవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తుంటే ఒప్పుకోవడానికి మనకి మనస్సు రాక మనం నిజమని తెలిసీ నమ్మలేదు.
భాగ్యనగరంలో ఆయన వేసిన ఫ్లై ఓవర్ల మీద తిరుగుతూ ఆయన వేసాడంటే తెలిసీ నమ్మలేదు.
షమ్షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు ఎక్కుతూ దిగుతూ దానికి ఆధ్యుడు ఆయనే అంటే మనం గుర్తించదల్చుకోలేదు.
ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీ అని మనల్ని సన్మార్గంలో నడపాలని చూస్తే మాతో పని చేయిస్తావా అని ఆయన్ని దగ్గరుండి ఓడించాం.
రాష్ట్ర విభజన అగ్ని ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే ఆయన సమ న్యాయం అంటే “రెండు కళ్ళ సిద్ధాంతం” అని నవ్వాం. తెలంగాణ ప్రజల మనోభీష్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన సమయాన తెలంగాణ రాష్ట్రం అన్నది ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆంధ్రులకు రాజధాని కావాలి. అభివృద్ధి చెందిన రాజధానికి నాలుగైదు లక్షల కోట్లన్నా ఖర్చవుతుంది అంటే ఆయన మాటలు మన చెవికెక్కలేదు.
కొత్త రాష్ట్రాం, ఆర్ధిక లోటు ఉన్న రాష్ట్రం కాబట్టి కేంద్ర సహకారం అవసరం అని ఒక జాతీయ పార్టీతో జతకడితే విమర్శించాం.ఆ జాతీయ పార్టీ ఓట్ల రాజకీయాలతో మన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, మన లక్ష్యాలకు మనల్ని దూరం చేస్తున్న సమయాన నయానా భయానా వాళ్ళకి నచ్చజెబుతూ ముందు అన్ని ప్రాజెక్టుల అనుమతులు అయితే సాధిద్దాం, అసలు అనుమతులే రాకపోతే ఈ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అని పంటి బిగువున అవమానాల్ని భరిస్తూ కార్య సాధన వైపు అడుగులేస్తుంటే నలుగురం నాలుగు రాళ్ళు, సూటిపోటి మాటలు విసిరాం.
నమ్మించి గొంతు కోసిన పార్టీపై ఒంటరిగా పోరాడుతుంటే మనకేమీ పట్టనట్లు మిన్నకుండి పోయాం. ఆంధ్రుల జీవనాడి పోలవరంని ఆఘమేఘాల మీద రాష్ట్రం డబ్బులతో నిర్మిస్తుంటే అందులో అక్రమాలు అని అడ్డు తగులుతున్నాం. పట్టిసీమని ఒట్టిసీమ అన్నాం, అమరావతిని భ్రమరావతి అన్నాం.ఆయన అనుభవమంత వయసులేని అక్రమార్కులూ అజ్ఞానులూ ఆయన్ని నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటే విని ఆనందించాం. వికృతానందం పొందాం.
ప్రజాస్వామ్యబద్దంగా అధికార మార్పిడి జరిగినా ఇంకా వెన్నుపోటు అని అజ్ఞానంతో విమర్శిస్తున్నాం. అసలు ఆయన నోటితో అనని వ్యవసాయం దండగ అన్న పదాన్ని ఆయన నోట్లో కుక్కాం. ఇంత జరిగినా ఒక్కర్ని ఒక్క మాట అనడు, మాట తూలడు, మనిషి క్రుంగడు, మనకన్నా ముందు లేస్తాడు, మనం అంతా నిద్రించాక పడుకుంటాడు. పదవిలో ఉన్నా లేకపోయినా పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉంటాడు. ప్రజలతో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు.
ఇంకా ఇదంతా నమ్మొద్దు అని, నమ్మినా నమ్మనట్లు ఉందాం అని కొందరి మనస్సుల్లో అనిపిస్తూ ఉంటుంది. పర్వాలేదు. అలాగే ఉండండి. ఆయన ప్రతి పనీ తెలుగువారందరికోసం. మన, పర అన్న భేధాలు మనకి ఉన్నాయి. ఆయనకు లేవు. ఎందుకంటే ఆయన సిసలైన తెలుగు బిడ్డ. తెలుగోడి ధైర్యం. మీది ఏ పార్టీ అయినా కావొచ్చు, ఏ కులం, మతం అయినా కావొచ్చు. మీరు ఆయన్ని ఇష్టపడకపోవచ్చు. కానీ.. ఒక్క సారి ఈ క్రింది వీడియో చూడండి.
మళ్ళీ చెబుతున్నా ఇది మీ ఆంధ్రుల భవిష్యత్తు. అందుకే ఈ నలబై నిమిషాల వీడియోని బాత్ రూం లోనో, భోజనం చేస్తూనో, నిద్రకు ఉపక్రమించే ముందు బెడ్ రూం లోనో, క్యాబ్ లోనో బస్సులోనో ఆఫీసుకి వెళ్ళేటప్పుడో, ఆఫీసు నుండి వచ్చేటప్పుడో, భోజన విరామ సమయంలోనో.. ఎప్పుడో ఒకప్పుడు మీకు సరిగ్గా నలబై నిమిషాల సమయం దొరికినప్పుడు మొదటి నుండి చివరి వరకూ చూడండి.
ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు.. (ఇది ఇప్పటికే గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది).. ఆ అద్భుతం జరిగిపొయ్యాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.. (ఈ సారైనా జరిగిపొయ్యేదాకా కళ్ళు మూసుకోకుండా కింద వీడియో సహాయంతో మీ కన్న నేలపై అసలు ఏం జరుగుతుందో గుర్తించండి)’’
ధన్యవాదములు.
ReplyForward
|