మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సిబిఐ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ పై తీర్పును సీబీఐ కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. తన కూతుళ్ళ ను కలిసేందుకు వెళ్తున్నట్లు జగన్ కోర్టుకు వెళ్లడించాడు.
అయితే లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే జగన్ పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయని, ఈ సమయం లో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని సీబీఐ వాదించింది.
ప్రతి కేసులో జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడని, మే 15వ తేదీ న జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. జగన్ గతంలో కూడా అనేక సార్లు విదేశాలకు వెళ్లాడని ఎక్కడ కూడ కోర్టు నిబంధనలను ఉల్లంగించలేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు.
రైట్ టూ ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దాన్ని కాలరాయడం సరైంది కాదని జగన్ తరపు న్యాయవాది వాదించాడు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పు ఈ నెల 14 కు వాయిదా వేసింది.