వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు పార్టీ నేతలు.. మరోవైపు తన సన్నిహితులు.. ఇంకోవైపు అంతకంతకూ పడిపోతున్న ఇమేజ్ గ్రాఫ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి వేళలోనే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత లోపాలు బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. ఆవునెయ్యిలో చేప కొవ్వు.. పంది కొవ్వుతో కలిసి ఉండటం.. ఆ రిపోర్టు వెలుగు చేసిన వైనంతో మొత్తం సీన్ మారిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెలుగు చూసిన గంటల వ్యవధిలోనే జాతీయ మీడియా సైతం అటెన్షన్ పే చేసింది. లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై ప్రత్యేక ప్రోగ్రాంలు.. చర్చా కార్యక్రమాలతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఇంకొందరు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి కారణం.. జగన్మోహన్ రెడ్డిసరైన రీతిలో రియాక్టు కాకపోవటంతోనే. ఎవరు అవునన్నా.. కాదన్నా తప్పు అయితే జరిగిపోయింది. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసి ఉంటే బాగుండేది.
నిజానికి ఇదంతా కావాలనే కత్తి కట్టి చేసినట్లుగా ఎలాంటి ఆధారాల్లేవు. అంతేనా.. ఇలాంటి అంశాల్లో ఒక ఫార్మాట్ ప్రకారం కుట్రలు జరిగాయని ఆరోపించటం కూడా తప్పే అవుతుంది.
కానీ.. రాజకీయం ఉత్తినే ఉండదు కదా? గడిచిన మూడు రోజులుగా పెరిగిపోతున్న ఒత్తిడి పార్టీ కార్యకలాపాల మీద తీవ్ర ప్రభావాన్ని పడేలా చేస్తున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి విషయం ఎక్కడ మీద పడుతుందోనన్న భయాందోళనలతో అవసరానికి మించిన రియాక్షన్ కూడా మంచిది కాదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికే వస్తే.. తాను పవర్ లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలోని రామతీర్థం పుణ్య క్షేత్రంలోని శ్రీరాముడి తలను తీసుకురావటం తెలిసిందే. ఆ సందర్భంగా స్థానికంగా ఎవరు బయటకువచ్చి విమర్శలు చేసినా.. వారి నోటి నుంచి మాటలు వచ్చినా పరిస్థితులు మరోలా ఉండేవి. ఆ రోజున కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఇష్యూలను ఐడెంటిఫై చేసి.. బలంగా పోరాడే వారి వాదనల్ని విని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
అందుకు భిన్నంగా మాట్లాడే వారిని మౌనంగా ఉంచేశారు. లోపాల్ని ఎత్తి చూపే వ్యవస్థల్ని బంద్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు లడ్డూ ఇష్యూలో ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్.. నాడు రామతీర్థంలో శ్రీరాముడి తలను తెగిని విషయాన్ని ఎంతో సింఫుల్ గా తీసేశారు. అందుకు భిన్నంగా అప్పట్లో తీవ్రమైన నిరసన.. ఆందోళనల్ని బలవంతంగా నిలిపేశారు.
అప్పుడు కూడా జరిగిన పొరపాటుకు వేదన చెందుతూ.. కోర్టును ఆశ్రయిస్తే బాగుండేది. ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు దారుణ పరిణామం చోటు చేసుకుంటే..కనీసం ఆవేదన చెందింది లేదు? ఆ రోజున కోట్లాది మంది రామభక్తుల మనోభావాలు తిన్న విషయంపై ఎందుకు మాట్లాడలేదు? వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాల్సింది కదా? అంతేకాదు.. తమ పదవీ కాలంలో రామతీర్థంలో శ్రీరాముడి తల నరికిన కేసును ఎందుకు తేల్చలేదు? అప్పుడు చప్పుడు చేయని జగన్ అండ్ కో ఇప్పుడు మాత్రం లడ్డూ వివాదంపై పెద్ద ఎత్తున మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఎప్పటికి గుర్తిస్తారు?