ఏపీ ముఖ్యమంత్రి 38 కేసుల్లో నిందితుడు అన్నది జగన్ తో పాటు అందరికీ తెలిసిన విషయమే. ఆయన తాజాగా సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి మీద అవినీతితో పాటు పక్షపాత ఆరోపణలు చేశారు. చంద్రబాబు కోసం ఆయన ఏపీ సర్కారును ఇబ్బంది పెట్టేలా తీర్పులు ఇస్తున్నారన్నది ఆయన చేసిన ప్రధాన ఆరోపణ. అయితే, తాజాగా కొత్త వాదన తెరపైకి వచ్చింది. నిన్నటి నుంచి దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది అని కొందరు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చాలామంది ఒక విషయాన్ని కనుక్కున్నారు.
ఎన్వీ రమణ మీద ఆరోపణలు అటు జగన్ కి రాజకీయ లాభం, బీజేపీ పెద్ద అమిత్ షాకి రాజకీయ లాభం చేకూరుస్తాయట. అయితే, మొన్న జగన్ అమిత్ షాను కలవడం, వీరితో పాటు గతంలో ప్రధాన న్యాయమూర్తి అవ్వాల్సి ఉండి కాలేకపోయిన జాస్తి చలమేశ్వర్ కొడుకు ఉండటం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక జగన్ రెడ్డి వ్యవహారం గమనిస్తే ఆయన కాబోయే ప్రధాన న్యాయమూర్తి, సాటి తెలుగు వాడు అయిన ఎన్వీ రమణ మీద దారుణమైన ఆరోపణలుచేశారు.
దీనివల్ల ఇద్దరికి భారీ లాభాలున్నాయి.
1. జగన్ రెడ్డి
ఈయన ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బెయిల్ మీద బయట ఉండి ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న మహానుభావుడు ఈయన. ఇపుడు రాజకీయ నేరస్థుల కేసులు త్వరగా విచారించి క్లియర్ చేయాలన్న వ్యవహారం తెరమీదకు రావడంతో జగన్ కి పదవీ గండం వచ్చింది. అత్యధిక కేసులున్న రాజకీయ నేత దేశంలో ఇతనే. ఈసారి అతని కేసులు నిరూపితమై జైలుకు పోతే వైసీపీ పార్టీకి ఇక సమాధి కట్టినట్లే. మళ్లీ పార్టీ బతికి బట్టకట్టడం అన్నది అంత సులువు కాదు. అంతవరకు కాపాడుకోవడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డికి అవసరమైనది పవర్ కాదు, ప్రజా బలం. అందుకోసం ఏకంగా కేసులు విచారిస్తున్న వారి మీద, తన ప్రతిపక్షం మీద కలిసొచ్చేలా ఒకేసారి ఉమ్మడి ఆరోపణలు చేశారు. ఇలా చేయడం వల్ల జగన్ కి శిక్ష ఏమీ తగ్గదు. మరి ఆయన కు లాభం ఏంటి అంటే… ఇపుడు కనుక తనకు శిక్షపడితే నేను ఏ తప్పు చేయకపోయినా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు శిక్ష వేశారు అని జనాన్ని నమ్మించడం ద్వారా పార్టీని బతికేలా చేయడం, ప్రజాబలం సంపాదించుకుని భార్యని లేదా అమ్మని సీఎం చేయడం ద్వారా తాను బయటున్నా లోపలున్నా సీఎం పవర్ తన ఇంట్లో ఉంచుకోవడం.
2. అమిత్ షా
వాస్తవానికి ఇది అమిత్ షాకి నేరుగా కలిగే లాభం కాదు గాని…. ప్రచారం జరుగుతున్నది మాత్రమే మనం చర్చించుకుందాం. సుప్రీంకోర్టులో ఎన్వీరమణ తర్వాతి స్థానం ఉదయ్ లలిత్ అనే న్యాయమూర్తిది. ఎవరు ఈ ఉదయ్ లలిత్… అంటే అమిత్ షా తుల్సి ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులో అప్పట్లో అమిత్ తరఫున వాదించిన లాయర్. 2014లో అమిత్ షా చేతికి పవర్ రాగానే అతను సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి అయితే… అతను రిటైర్ అయ్యాక కేవలం రెండు నెలలు మాత్రమే లలిత్ కి ఆ పదవి దక్కుతుంది. అలా కాకుండా ఎన్వీరమణ మీద ఏవైనా ఆరోపణలు వచ్చి అతనిపై మరకపడితే ప్రధాన న్యాయమూర్తి పదవి దానివల్ల మిస్సయితే… ఈ ఉదయ్ లలిత్ అనే వ్యక్తి అటు రమణ పదవీకాలం, తన పదవీకాలం కలిపి ఎంజాయ్ చేసే అవకాశం దక్కుతుంది. అలా అమిత్ షా అలనాటి లాయర్ కి ఎంతో మేలు జరుగుతుంది. దక్షిణాది వ్యక్తి చేతికి రావల్సిన కీలక పదవి ఉత్తరాది వారి చేతిలోనే ఉండిపోతుందన్నమాట.
ఈ సమాచారం చదివారు కదా ఇపుడు మీకు ఏం అర్థమయ్యింది?
సింపుల్ గా చెప్పాలంటేతెలుగువాడి కంటినితెలుగు వాడితోనే పొడిపిస్తున్నఉత్తరాది నాయకుడుఆనాడు ఎన్టీఆర్ తెలుగు వాడు పీఎం అవుతుంటే పోటీయే విరమించుకున్నాడుఈనాడు జగన్ సాటి తెలుగు వాడు సీజీఐ అవుతుంటే తాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు