• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీ హోం మంత్రి రేసులో ఆ న‌లుగురు

admin by admin
March 19, 2022
in Andhra, Around The World, Politics, Top Stories
0
0
SHARES
474
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎవ‌రి మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో? ఎవ‌రికి కొత్త‌గా మంత్రి యోగం ప‌ట్ట‌నుందో? ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త్వ‌ర‌లో జ‌రుగుతుంద‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చెప్పిన నేప‌థ్యంలో చ‌ర్చంతా దీని చుట్టే తిరుగుతోంది. దాదాపు 90 శాతం మంత్రుల‌పై వేటు ప‌డుతుంద‌ని జ‌గ‌న్ తేల్చిచెప్ప‌డంతో ఉద్వాస‌న‌కు గుర‌య్యే నేత‌లు ఎవ‌రనే ఆస‌క్తి మొద‌లైంది. మ‌రోవైపు కొత్త‌గా కేబినేట్‌లోకి ఎవ‌రిని తీసుకుంటార‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. ప‌ద‌వులు పోయిన మంత్రుల‌కు జిల్లా, ప్రాంతీయ మండ‌ళ్ల పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు క‌ట్ట‌బెడ‌తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం ఉన్న మ‌హిళా మంత్రుల ప‌ద‌వులు కూడా ఊడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మేక‌తోటి సుచ‌రిత‌, పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వ‌న‌తి మ‌హిళా మంత్రులుగా ఉన్నారు. వీళ్లు కూడా ఇప్పుడు ఆ ప‌ద‌వులు వ‌దులుకోవాల్సిందేన‌ని తెలుస్తోంది. ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న సుచ‌రిత కూడా రాజీనామా చేయాల్సిందేన‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడా ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది హాట్ టాపిక్‌గా మారింది.

కొత్త‌గా మంత్రివ‌ర్గంలో చేరే న‌లుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రికి హోం మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతి, అనంత‌పురం జిల్లా సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి, చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడుద‌ల ర‌జ‌నీ, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాల్లో ఒక‌రికి ఆ అవ‌కాశం ద‌క్కుతుంద‌ని టాక్‌. ప‌ద్మావ‌తి, ర‌జ‌నీలకు ఎక్కువ ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ఇద్ద‌రూ తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో ఒక‌రు ఎస్సీ.. మ‌రొక‌రు బీసీ కావ‌డంతో ఈ సామాజిక వ‌ర్గాలు వాళ్ల‌కు ప్ల‌స్‌గా మారుతున్నాయ‌ని అంటున్నారు. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు హోంమంత్రి అవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ఫైర్‌బ్రాండ్ రోజాకు మొద‌ట హోం మినిస్ట‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆమెకు సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో పాటు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారాయి. ఇప్ప‌టికే న‌గ‌రిలోని  ఓ వ‌ర్గం వైసీపీ నేత‌లు రోజాకు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నార‌నే టాక్ ఉంది.  ఆమెకు మంత్రి ప‌ద‌వి రాకుండా అడ్డుకునేందుకు వాళ్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. రెడ్డి శాంతికి కూడా సామాజిక సమీకరణాలే మైనస్ అయ్యాయని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags: ap home ministerchilakaluripethome ministerJaganmla rojamla vidadala rajaninagariRojaYSRCP
Previous Post

పవన్ డార్క్ లో ఉన్నారా ?

Next Post

అనుపమ మనసు దోచే చూపులు

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Around The World

వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Load More
Next Post

అనుపమ మనసు దోచే చూపులు

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra