ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను తాజాగా తమ విడాకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 1995లో వీరి వివాహం జరిగింది. రెహమాన్, సైరా దంపతులకు ముగ్గురు సంతానం. 29 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే కనిపించిన ఈ జంట.. ఇప్పుడు సడెన్ గా విడిపోతున్నట్లు ప్రటకన చేయడంలో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న రెహమాన్ అభిమానులు జీర్ణయించుకోలేకపోతున్నారు.
ఇక ఇదే సమయంలో రెహమాన్, సైరా విడాకులు తీసుకోవడానికి మోహిని డేనే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. కోల్‌కతా నివాసి అయిన మోహిని .. ముంబైలో పెరిగింది. చాలా కాలం నుంచి రెహమాన్ ట్రూప్ లో బాస్ ప్లేయర్‌గా పని చేస్తోంది. రెహమాన్‌తో కలిసి వరల్డ్ వైడ్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. 29 ఏళ్ల మోహిని.. సంగీత స్వరకర్త మార్క్ ను వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో మోహిని చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అయితే రెహమాన్ దంపతులు విడాకుల ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మోహిని డే కూడా మార్క్ తో విడిపోతున్నట్లు ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెహమాన్, ఆయన లేడీ శిష్యురాలు మోహిని ఒకేసారి డివోర్స్ అనౌన్స్ చేయడంతో అనేక అనుమానాలకు తెర లేపింది. రెహమాన్, మోహిని మధ్య ఎఫైర్ ఉందా? అందుకే సైరా భాను భర్తకు విడాకులు ఇచ్చిందా..? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా సైరా తరఫు లాయర్ క్లారిటీ ఇచ్చారు. రెహమాన్, సైరా పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నారు.. వారి విడాకులతో మోహినికి ఎటువంటి లింక్ లేదని లాయర్ తెలిపారు. మరి లాయర్ మాటలు ఎంత వరకు నిజమన్నది తెలియాలి.