అదేంటి.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? నిజమే. ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న రాజకీయ బాండింగ్ అలానే ఉంది. అందుకే ఈ రెండు రాష్ట్రాల మధ్య పొలిటి కల్ చర్చలు కూడా అలానే సాగుతున్నాయి. కార్యాకారణ సంబంధాలు రెండు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ కోవలోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఎవరికి మేలు జరుగుతుంది? అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
ఇది రెండు విధాలుగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటి.. ఏపీలో టీడీపీ బలపడుతుందని చెబుతున్నారు. రెండు.. రెడ్డి సామాజిక వర్గానికి తెలంగాణ కంచుకోటగా మారుతుందని అంటున్నారు. అది కూడా.. సీమరెడ్డి సోదరులకు బలమైన కేంద్రంగా హైదరాబాద్ ఉంటుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. చంద్రబాబుకు శిష్యుడు కావడంతో ఆయన ప్రభావంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందనేది నిష్టుర సత్యం.
ఈ క్రమంలో ఏపీలో ఈ ప్రభావం చూపుతుందని లెక్కలు వేస్తున్నారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. తిరిగి పుంజుకునే అవకాశం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.ఈ పరిణామాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికే తెరమీదికి వస్తాయని చెబుతున్నారు. ఇక, సీమ రెడ్డి నాయకులు.. నిజానికి తెలంగాణలో రేవంత్‌కు అండగా ఉన్నారనేది చెప్పకనే చెబుతున్న మాట. కాంగ్రెస్ నేతలకు.. వీరు పెట్టుబడులు కూడా పెట్టారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
దీంతో వారికి రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే.. మేలు జరుగుతుందని అంటు న్నారు. వారి వ్యాపారాలు మరింత పుంజుకుని.. పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని కూడా చెబుతు న్నారు. ఇక, ఇదేసమయంలో వైసీపీపైగా కాంగ్రెస్ ఎఫెక్ట్ ఉంటుందని.. తెలంగాణ కేంద్రంగా ఉన్న వైసీపీ నాయకుల హవా తగ్గుముఖం పట్టడమో.. లేక.. ప్రభావం చూపడమో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ సహా రెడ్డి సామాజిక వర్గంలోని ఓవర్గానికి తెలంగాణ కాంగ్రెస్ ఫలితం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.