రామోజీ రావు.. కొన్ని కొన్ని విషయాల్లో నిబద్ధతకు పెద్ద పీట వేసేవారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబం ధించి.. నాయకులకు సంబంధించి.. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. నాయకుల వ్యక్తిగత విష యాల జోలికి పోవద్దని పదే పదే చెప్పేవారు. కానీ, పోటీ పత్రికలతోపోటీ పడాలని మాత్రం చెప్పేవారు. ఈ విషయంలో కొన్ని కొన్సి సందర్భాలు ఈనాడును ఇరుకున పడేశాయి. అలాంటి సమయాల్లో వివరణ ఇచ్చుకున్న సందర్భాలు కూడా.. ఉన్నాయి.
ఓ సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త ప్రచురితమైంది. ఇది ఈనాడులో ప్రచురితమై.. వైఎస్ నుంచి లేఖ కూడా వచ్చింది. దీనిపై స్పందించిన రామోజీ.. ఉద్యోగులకు పెద్ద లేఖ రాశారు. “మీరేమో రాసేస్తారు… వాళ్లంతా నాకుబడి ఏడుస్తారు!“ అంటూ.. ముగించారు. ఇక, అప్పటి నుంచి ఈనాడులో వ్యక్తిగత విషయాలు రాలేదు. అయితే.. ఎప్పుడైనా రాయాల్సి వచ్చినప్పుడు నాయకు ల వివరణను జోడించి మాత్రమే రాసేశారు.
ఇదేసమయంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. ఆయన ఏ ఆహారం తీసుకుంటున్నారు..? అనే విషయంపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. ఈ యాత్రకు ఈనాడు కూడా కవరేజీ ఇచ్చినా.. జగన్ వ్యక్తిగత అంశాల జోలికి మాత్రం వెళ్లలేదు. దీనికి ముందు వైఎస్ పాదయాత్ర చేసినప్పు డు.. కూడా ఇదే విధానం కొనసాగింది. కానీ, చంద్రబాబు వస్తున్న మీకోసం యత్ర చేసినప్పుడు మాత్రం ఆయన అనుమతి తీసుకుని.. కొన్ని కొన్ని విషయాలను వ్యక్తిగతమే అయినా.. ప్రచురించారు. ఇలా.. రామోజీ.. కొన్ని కొన్ని విషయాల్లో పాటించిన నిబద్ధత ఈనాడు స్థాయిని ఆసాంతం పెంచాయి.