అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నపుడు ఎంత చర్చ జరిగిందో.. వాళ్లిద్దరూ విడిపోయినపుడు కూడా అంతే డిస్కషన్ జరిగింది. టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అనిపించుకున్న జంట.. విడిపోవడమే అభిమానులకు చాన్నాళ్ల పాటు రుచించలేదు. విడాకులకు కారణాలేంటన్న దానిపై విపరీతమైన చర్చ జరిగింది. నాగచైతన్య మీద సెటైర్లు వేస్తున్నట్లుగా సమంత పెట్టిన ఇన్ డైరెక్ట్ పోస్టులు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే.
చైతూ ఈ విషయమై చాలా పరిమితంగా మాట్లాడాడు కానీ.. సమంత మాత్రం వీలుచిక్కినపుడల్లా తన మాజీ భాగస్వామి మీద ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్లు వేస్తూనే ఉంది. ఈ మధ్య ‘సిటాడెల్’ సిరీస్ రిలీజ్ సందర్భంగా జరిగిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో.. తన ఎక్స్‌కు కాస్ట్లీ గిఫ్టులివ్వడం వర్త్ లెస్ అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
తాజాగా సమంత షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ.. తన పాత రిలేషన్షిప్ గురించి జనాలు చర్చించుకునేలా చేస్తోంది. అది ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడిన వీడియో. అందులో అతను ‘‘మీరు గొప్ప భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండొచ్చు. తనతో నిజమైన ప్రేమను పొందేలా గొప్ప బంధాన్ని కలిగి ఉండొచ్చు. కానీ మీరు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకుంటే మీ భాగస్వామి కోరుకున్నట్లుగా తనకు మీరు కనిపించరు’’ అని పేర్కొన్నాడు.
సమంత దీన్ని షేర్ చేయడంతో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆమె మామూలుగానే ఈ పోస్టు పెట్టి ఉ:డొచ్చు కానీ.. జనాలు దీన్నుంచి రకరకాల అర్థాలు తీస్తున్నారు. చైతూతో విడిపోయే సమయంలోనే సమంత అనారోగ్యం పాలైంది. మయోసైటిస్ వ్యాధితో పోరాడింది. ఇప్పుడీ పోస్టు పెట్టడంతో సామ్ అనారోగ్యం పాలవడంతోనే చైతూ నుంచి విడిపోవాల్సి వచ్చిందా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.