ఉత్తర కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో – బే ఏరియాలోని ఫ్రీమాంట్ నగరంలో “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” సందర్భంగా” ఫెస్టివల్ అఫ్ గ్లోబ్ (FOG) సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల దినోత్సవ వేడుకలు ఆగష్టు 20న ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం అనేక స్థానిక భారతీయ సాంస్కృతిక సంస్థలు తమ తమ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేట్టుగా ముస్తాబు చేసిన శకటాలను నగర వీధుల్లో ఊరేగించారు.
ఇందులో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) సంస్థ వారు భారతీయ మహిళా శక్తి ని లోకానికి తెలియ చెప్పిన “రాణి రుద్రమ దేవి” తో పాటు వివిధ రంగాలలో రాణించి భారతావనికి కీర్తి తెచ్చిన మహిళా నాయకులైన “ఇందిరా గాంధీ’, ప్రతిభ పాటిల్ ,మదర్ థెరెసా, ప్రియా ఝినగం, కిరణ్ బేడీ, కల్పనా చావాలా ప్రతిబింబాలు/ ప్రతిమలతో అలంకరించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘వెటా’ శకటం మరియు సంస్థ చేసిన వివిధ సేవా కార్యక్రమాలను అభినందిస్తూ “బెస్ట్ కమ్యూనిటీ సేవ” అవార్డును గెలుచుకున్నారు.
ఈ శకటంలో వివిధ నాయకుల వేషధారులై ఊరేగింపు ఆద్యంతం ఆహుతులను అలరించి, భావి తరాలకు ఆదర్శంగా నిలిచిన “చిన్నారులు” ప్రత్యేక అభినందనలు అందుకున్నారు.
ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకించడానికి దాదాపు 2 వేల మంది ఆహుతులు వచ్చారు
.”తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే “మహిళ సాధికారతే “లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను రెండు సంవత్సరాల క్రింద ఉత్తర అమెరికాలో , ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహిళలకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను(క్రియేటివిటీ) పెంచి వారి కలలను సాకారం చేసుకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలనే ఉద్దేశ్యంతో ఝాన్సీ రెడ్డి ఈ సంఘం స్థాపించారు.
మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తోంది.ఈ వేడుకలలో ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , సలహా కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, కోర్ కమిటీ “అనురాధ, హైమ, పూజ , విశ్వ, మీడియా చైర్ సుగుణ రెడ్డి, కల్చరల్ చైర్ రత్నమాల వంక తో పాటు సరోజ మంగ, శైలజ గిలేలా, సునీత గంప, చందన రెడ్డి, మాధురి రెడ్డి, దివ్య, భువన్ వేమిరెడ్డి , వినీత్ మరియు అనేక మంది వాలంటీర్ మెంబెర్స్ పాల్గొని విజయవంతం చేశారు.
Comments 1