ప్రస్తుత’ తానా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో ‘జాయింట్ సెక్రటరీ’ పదవికి పోటీ పడుతున్న ‘వెంకట్ కోగంటి’ వివిధ ప్రచార కార్యక్రమాల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నరేన్ కొడాలి ప్యానల్ తరపున పాల్గొంటున్నారు. వివిధ చోట్ల జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ, తమ టీమ్ పని చేసే టీమ్ అని, అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కలిసే తీసుకుంటామని తానాకు, కమ్యూనిటీకి మేలు చేసే ఈ టీమ్‌ను అందరూ గెలిపించాలని కోరారు.
తాము గెలిస్తే తమ వెనకాల ఉండి ఎవరో మమ్మల్ని నడిపిస్తారని చెప్పడం అవాస్తవమని అంటూ, ఈ టీమ్‌లో ఉన్నవారంతా దాదాపు 10, 15 సంవత్సరాలకుపైగా తానాలో వివిధ కార్యక్రమాల్లో పనిచేసిన అనుభవం గడించినవారేనంటూ చెప్పారు.
నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో రాక ముందు చాలా సంవత్సరాలపాటు ‘తానా’కు వలంటీర్‌గా అనేక సేవలందించానని అంటూ, అప్పటికీ, ఇప్పటికీ తాను ‘తానా’ తరపున కాలిఫోర్నియాలోనూ , తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలను చేస్తున్నానని చెప్పారు. కోవిడ్ సమయంలో దాదాపు 10వేలమందికి అన్నదానం చేశానని, కాలేజీ స్టూడెంట్లకు స్కాలర్ షిప్‌లు ఇచ్చానని తెలిపారు.
బే ఏరియాలో కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, పాఠశాల ద్వారా తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించే కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటూ భాషా సేవ చేస్తున్నానని చెప్పారు. అలాగే బే ఏరియాలో ఉన్న అనాథ శరణాలయాలకు, ఇతర ఎన్జీవో సేవా సంస్థలు నిర్వహించే కేంద్రాలకు ఫుడ్ ప్యాకెట్లు, ఇతర నిత్యావసర సరకులను ‘తానా’ తరపున అందించినట్లు చెప్పారు.
ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన అనుభవంతో మీ ముందుకు వచ్చిన నన్ను ‘జాయింట్ సెక్రటరీ’గా గెలిపించి ఆశీర్వదించాలని ‘వెంకట్ కోగంటి’ కోరుకుంటున్నారు.