మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం `లైలా` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రామ్ నారాయణ్ దర్శకుడిగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న లైలా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న ఎంటర్టైనర్ ఇది. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతుండటంతో.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ప్రచార కార్యక్రమాల ద్వారా చిత్రబృందం మరింత బజ్ క్రియేట్ చేస్తోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్.. లైలా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన బ్రేకప్ స్టోరీని రివీల్ చేశాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. టీనేజ్ లో ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇష్టం కలుగుతుంది. మనం దాన్ని గుడ్డిగా సీరియస్ రిలేషన్ షిప్ అనుకుంటాం. నాకు కూడా ఓ స్టోరీ ఉంది. 24 ఏళ్ల వయసులో నేను ఒక అమ్మాయితో లవ్‌లో పడ్డాను. మూడున్నర ఏళ్లకే మాకు బ్రేకప్ అయ్యింది. చాలా బాధపడ్డాను.
ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టాను. అప్పటి నుంచి మరే అమ్మాయిని ప్రేమించలేదు` అంటూ బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు. జీవితంలో బాధపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయని.. 27 ఏళ్ల వయసులో కూడా ఏడ్చానని విశ్వక్ సేన్ తెలిపాడు. పెళ్లిపై రియాక్ట్ అవుతూ.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటానని పేర్కొన్నారు. ఇక విశ్వక్ సేన్ బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అతని హార్ట్ బ్రేక్ అమ్మాయి ఎవరా? అని ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు.