బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీద వచ్చిన విమర్శల సంగతి అందరికీ తెలిసిందే. నెపోటిజం, యాక్టర్స్ యాటిట్యూడ్ పై అడియన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో బైకాట్ బాలీవుడ్ అనే ట్యాగ్ తెగ వైరలయ్యింది. చాలాకాలం పాటు హిందీలో రిలీజ్ అయిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.
అదే సమయంలో దక్షిణాది హీరోల మీద ప్రశంసల జల్లు కురిసింది. దక్షిణాదిలో హీరోలందరూ సాదాసీదాగా ఉంటారని, వారిలో ఎలాంటి యాటిట్యూడ్ కనిపించదని బాలీవుడ్ హీరోలతో పోలుస్తూ కామెంట్లు చేశారు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ను రాజమౌళి మార్చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును సాధించి ఏకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
అయితే తాజాగా బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ గా మార్చేశాయి. సౌత్ సెలబ్రెటీస్ మొత్తం ఫేక్ గా కనిపిస్తారు. వారంతా కెమెరా ముందు తాము ఎంతో ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. కానీ వారు ఎలా ఎప్పుడు సహనం కోల్పోతారో చెప్పలేం. హీరో విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్లకు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్ గా ఉన్నట్లు చూపించుకోవడానికి అలా నటించాడు.
మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ సైలెంట్ గా ఉంటాడు. అతడు ఓ హోటల్ కు వెళ్తుండగా.. ఫోటోగ్రాఫర్ అతడిని వీడియో తీశాడు. వెంటనే ఆయన మా పై కోప్పడ్డాడు. నిజానికి అతడి ఫోటో తీసింది వేరే వ్యక్తి. కానీ అతనడు మాపై కోప్పడ్డాడు. అలాగే మరో సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ నాకు అవసరం లేదని చెప్పాడు. అతడు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారేంటీ అనుకున్నాను. సౌత్ హీరోలు చాలా ఫేక్. బాలీవుడ్ హీరోస్ లోపల, బయట ఒకేలా ఉంటారు” అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ఇతరులను తక్కువ చేసి మాట్లాడతారన్న విమర్శలు వస్తున్నాయి.